Kcr : తెలంగాణ ముఖ్యమంత్రి రాజీనామా(చేయాల్సిందేనా)?

Kcr : కేసీఆర్, కేటీఆర్ మధ్య పెద్ద తేడా ఏం లేదు. ఒక్క అక్షరం మాత్రమే మారిస్తే సరిపోతుంది. అలాగే.. ముఖ్యమంత్రిగా ఒకరి స్థానంలోకి మరొకరు మారటం కూడా అంత పెద్ద కష్టమేం కాదు. ఈజీగానే జరిగిపోతుంది. కాకపోతే రాజ్యాంగంపరంగా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో కావాల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాల్సిందేనా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతిఒక్కరి మనసులోనూ మెదులుతోంది. ఎందుకంటే ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ సీఎం కావాలంటే కేసీఆర్ టెక్నికల్ గా, తప్పనిసరిగా తన పదవికి రిజైన్ చేయాల్సిందేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ ఈరోజు సాక్షాత్తూ శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావే చెప్పారంటే దానికిక తిరుగులేదని కొందరు భావిస్తున్నారు. అందువల్ల సీఎం పదవీ మార్పిడి ప్రక్రియ ఎలా జరుగుతుందనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఒక వైపు పద్మారావు వ్యాఖ్యలు సంచలనం రేపుతుండగా మరోవైపు.. టీఆరెస్ ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి (ఆర్మూర్).. కేటీఆర్ కి కంగ్రాట్స్ చెబుతూ పూల మొక్కను బహూకరిస్తున్న ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. దీనికితోడు ‘కేటీఆర్ సీఎం’ అనే ప్రచారాన్ని సీఎం కేసీఆర్ కూడా ఖండించట్లేదు. కనీసం చిన్న ప్రకటనైనా చేయట్లేదు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి త్వరలోనే మారనున్నారనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

కేబినెట్ రద్దు?

తెలంగాణలోని అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కోరుకుంటున్నట్లుగా కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి. ఆ విషయాన్ని రాతపూర్వకంగా గవర్నర్ కి అందజేయాలి. కేసీఆర్ రెజిగ్నేషన్ ని గవర్నర్ ఆమోదిస్తే ఆయన మంత్రివర్గం రద్దవుతుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాసన సభా పక్ష (టీఆరెస్ఎల్పీ) సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. తమ నూతన నాయకుడిగా కేటీఆర్ ని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు తెలిపే తీర్మానాన్ని గవర్నర్ కి పంపాలి. అప్పుడు కేటీఆర్ ను ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. కేటీఆర్ సీఎంగా ప్రమాణం స్వీకరించాక కొత్త ముఖ్యమంత్రికి తనతోపాటు ప్రమాణం చేసే మంత్రుల్ని సెలెక్ట్ చేసుకునే విచక్షణాధికారం వస్తుంది.

kcr-telangana-cm-resing-or-not
kcr-telangana-cm-resing-or-not

రెండో మార్గం : Kcr

టీఆరెస్ శాసన సభా పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి తమ నాయకుడు/సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించాలి. అనంతరం కొత్త లీడర్/ముఖ్యమంత్రిగా కేటీఆర్ ని ఎన్నుకోవాలి. ఈ రెండూ ఒకేసారి చేయాలి. అప్పుడు సైతం టీఆరెస్ఎల్పీ నేతగా/సీఎంగా కేసీఆర్ రాజీనామా చేసి ఆమోదం పొందితేనే ఆయన కేబినెట్ రద్దవుతుంది. కేసీఆర్ రాజీనామాకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలుపుతూ, కొత్త నేతగా కేటీఆర్ ను ఎన్నుకుంటూ సంతకాలు చేసిన డాక్యుమెంట్ ని గవర్నర్ కి ఇవ్వాలి. వాటిని గవర్నర్ పరిశీలించి, ఓకే అన్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చంటూ రాజ్ భవన్ నుంచి కేటీఆర్ కి ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఆహ్వానంతో యువరాజు పట్టాభిషేకం పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా, కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ పాలన ప్రారంభమవుతుంది. తద్వారా గులాబీ పార్టీ శ్రేణుల ఆకాంక్ష నెరవేరుతుంది.

Advertisement