Joe Root : ఇలాంటి సెంచరీలు ఇంతకుముందు ఎవరూ కొట్టలే

Joe Root : ఇండియాలో ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ టూరు నేటితో మొదలైంది. మార్చి 28 వరకు కొనసాగే ఈ పర్యటనలో ఆ జట్టు మొత్తం 12 మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉన్నాయి. టెస్టు సిరీసులో భాగంగా ఈరోజు శుక్రవారం చెన్నైలో జరిగిన ఫస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన, అద్భుతమైన రికార్డు నెలకొల్పి వార్తల్లో నిలిచాడు. తద్వారా ఇండియా టూర్ ని ఘనంగా ఆరంభించాడు.

వరుసగా..

మన దేశంతో ఇవాళ ఆడిన మొదటి టెస్టులో జో రూట్ చేసిన సెంచరీ నభూతో అని చెప్పాలి. ఈ మ్యాచ్ అతనికి వెరీ వెరీ స్పెషల్ గా నిలిచిపోయింది. ఎందుకంటే ఇది జో రూట్ కెరీర్ లో వందో టెస్టు మ్యాచ్. వందో మ్యాచ్ లో వంద పరుగులు చేయటం గొప్ప అనుకుంటే ఇతగాడు శ్రీలంకతో జరిగిన చివరి రెండు మ్యాచ్ ల్లోనూ సెంచరీలు కొట్టి, నేడు వరుసగా మూడో మ్యాచ్ లో శతకం బాదటం మరో విశేషం.

నెవ్వర్ : Joe Root

వందో టెస్టులో వంద రన్నులు చేసిన 9వ ప్లేయర్ గా జో రూట్ నిలిచాడు. గతంలో రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), హషీమ్ ఆమ్లా, గ్రేమీ స్మిత్(ఇద్దరిదీ సౌతాఫ్రికానే), ఇంజమాముల్ హక్(పాకిస్థాన్) తదితరులు ఈ ఘనత సాధించారు. వరుసగా మూడు టెస్టు మ్యాచ్ ల్లో సెంచరీలు మాత్రం ఎవరూ చేయలేదు. మన శతకాల వీరులు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీలు సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. జో రూట్ తొలిసారిగా ఈ సరికొత్త చరిత్ర నమోదు చేశాడు.

Joe Root : england-cricketer-joe-root-special-centuary
Joe Root : england-cricketer-joe-root-special-centuary

వాళ్లదే పైచేయి..

తొలి టెస్టు తొలి రోజు టీమిండియాపై ఇంగ్లండే పైచేయి సాధించింది. కెప్టెన్ జో రూట్ సూపర్ ఫామ్ వల్ల ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 263/3 స్కోర్ సాధించింది. 65 పరుగులకే మనోళ్లు 2 వికెట్లు పడగొట్టినా ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. లాస్ట్ ఓవర్ లో ఎట్టకేలకు మూడో వికెట్ పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. బుమ్రా రెండు, అశ్విన్ ఒక వికెట్ ని తమ ఖాతాల్లో వేసుకున్నారు.

Advertisement