కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రి స్థాయికి ఎదిగిన రాజకీయ నేతలు వీరే !!

Mamatha Reddy 1000 - November 21, 2020 / 09:33 AM IST

12970కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రి స్థాయికి ఎదిగిన రాజకీయ నేతలు వీరే !!

కార్పొరేటర్ స్థాయి నుండి ఉన్నత పదవులను అధిరోహించిన రాజకీయనేతలు ఎంతోమంది ఉన్నారు. విశేషం ఏమిటంటే బల్దియా నియోజకవర్గం నుండి తమ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన వారే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కొనసాగుతున్నారు. నిజానికి కార్పొరేటర్ స్థాయి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ప్రస్తుత మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కార్పొరేటర్ గా గెలిచినవారయితే పలుసార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

తలసాని శ్రీనివాస్ యాదవ్:

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ 1986వ సంవత్సరంలో జనతాదళ్ పార్టీ తరఫున మోండా మార్కెట్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన 1994, 1999 సంవత్సరాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో ఆయనకు చంద్రబాబు క్యాబినెట్ హోదా కల్పించారు. 2004వ సంవత్సరంలో ఆయన ఓడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 2014 సంవత్సరం లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన.. తలసాని శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కార్పొరేటర్ స్థాయిలోనే ఓడిపోయినప్పటికీ.. కాలక్రమేణా ఎమ్మెల్యే, మంత్రి పదవులను చేజిక్కించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రస్థానం చెప్పుకోదగినది.

పద్మారావు గౌడ్:

padma rao goud

1986వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మోండా మార్కెట్ నుంచి పోటీ చేసి బల్దియా కార్పొరేటర్ గా ఎన్నికైన పద్మారావు గౌడ్ కూడా రాజకీయరంగంలో అంచెలంచెలుగా ఎదిగి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నిజానికి 1986 వ సంవత్సరంలో కార్పొరేటర్ గా గెలిచిన పద్మారావు చేతిలో ఓడిపోయింది మరెవరో కాదు తలసాని శ్రీనివాస్ యాదవే. 2002వ సంవత్సరంలో మళ్లీ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచినా పద్మారావు గౌడ్ 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కూడా నిలిచిన ఆయన ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు వ్యవహరించారు. ఇప్పుడు పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్ గా పని చేస్తున్న సంగతి విదితమే.

3. తీగల కృష్ణారెడ్డి

theegala krishna reddy

తీగల కృష్ణారెడ్డి 1986వ సంవత్సరంలో గాంధీ నగర్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయ రంగంలోనే కొనసాగుతూ హుడా చైర్మన్ గా నియమితులయ్యారు. టీడీపీ పార్టీ హయాంలో ప్రత్యక్ష మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2014వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున మహేశ్వరం నుండి పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. రాజకీయ పరిణామాల కారణంగా గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు.

4. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ

sulthan

రాజకీయ ఉద్దండుడు గా పేరొందిన సలావుద్దీన్ ఓవైసీ 1960లో మల్లేపల్లి నుంచి గెలిచి కార్పొరేటర్ గా పని చేశారు. తదనంతరం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆరు సార్లు మంత్రిగా గెలిచి భారతదేశ రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు. తండ్రికి తగ్గ కొడుకులుగా నిలిచిన అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు.

5. రేణుకా చౌదరి

renuka choudary

కేంద్రమంత్రి, శాసనసభ్యురాలిగా పని చేసిన చరిత్ర కలిగిన రేణుకా చౌదరి రాజకీయ ప్రస్థానం కూడా కార్పొరేటర్ స్థాయి నుంచే ప్రారంభమైంది. 1986 వ సంవత్సరంలో బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన రేణుకా చౌదరి టీడీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నత పదవులను అధిరోహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఆమె కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.

ముఖేష్ గౌడ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినా ముకేశ్ గౌడ్ సైతం బల్దియా పోరు నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రెండు సార్లు మంత్రిగా పని చేసారు.

వీరే కాక, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వస్తాను అహ్మద్ తదితరులు కార్పొరేటర్ స్థాయి నుంచే రాజకీయం రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు.