Eatala: ఈటల కథలో.. (అవి) నీతి ఏంటి?..

Eatala: కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈటల రాజేందర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ లా నిలుస్తున్నారు. ఆయనకి, టీఆర్ఎస్ కి మధ్య కొంత బాకీ మిగిలిపోయింది. ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈటల రాజీనామా చేస్తే ఆ బంధం పూర్తిగా తెగిపోతుంది. దీంతో కొత్త ఎపిసోడ్ మొదలవుతుంది. దీనికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని, రేపో మాపో అని అంటున్నారు. ఈటల కమలం పార్టీలోకి కాలు మోపటం లాంఛనమే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కథలోని నీతి, అవినీతి ఎంటనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ కథలో నీతి ఏమీ లేదని, అంతా అవినీతే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Eatala

సీఎం కేసీఆర్ కి తెలియదా?..

నిన్న మొన్నటి దాకా ఈటల రాజేందర్ అధికార పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. ప్రభుత్వంలో కూడా టాప్-5లో ఉండేవాడు. కాబట్టి ఆయన నిజంగా అన్ని, ఇన్ని ఎకరాల భూమిని కబ్జా చేసి ఉంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియకుండానే జరిగిందా అనే డౌటొస్తోంది. పోనీ సీఎంకి తెలియదనే అనుకుందాం. కనీసం లోకల్ ఆఫీసర్లకైనా తెలిసుంటుందిగా. మరి వాళ్లెందుకు పై అధికారులకు, ప్రభుత్వానికి చెప్పలేదు. ఇవన్నీ కాదు. ఇదంతా ఒట్టి నాటకం. అందరికీ అన్నీ తెలిసే జరుగుతాయి. కానీ ఎవరికీ ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని జనం అనుకుంటున్నారు. పెద్దాయనకి భయపడి నోరు మూసుకొని ఉంటే అంతా ఓకే. లేకపోతేనే ఈ కేసులు, విచారణలు, దర్యాప్తులు, సర్వేలు, రిపోర్టులు, చర్యలు, శిక్షలు, సంచలన వార్తలు ఎట్సెట్రా.. ఎట్సెట్రా. దీన్నిబట్టి రూలింగ్ పార్టీవాళ్లకు రూల్సూ గీల్సూ జాన్తా నై అని, అవినీతి కామన్ అని, పొలిటికల్ లీడర్లు చేసే పాపాల్లో ఇది కూడా ఒకటని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సామాన్యుడికి మాత్రమే చట్టం. రాజకీయ నాయకుడికి అది చుట్టం.

Eatala

రెండు పడవల మీద కాళ్లెందుకు?..

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కి గురయ్యాక ఈటల రాజేందర్ అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ నాయకులను వరసపెట్టి కలుస్తున్నారు. ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలకి ఇన్నాళ్లకు సమాధానాలు దొరికాయి. ఈటల శాసన సభ సభ్యత్యానికి రాజీనామా చేస్తే, హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వస్తే సపోర్ట్ కోసమంట. కానీ ఆ రెండు పార్టీలూ ఈ ప్రతిపాదనకు నిరాకరించాయి. అందుకే ఆయన చివరికి కాషాయం తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి. ఈటలకు తన నియోజకవర్గంలో నిజంగా అంత సొంత బలం ఉంటే ఒంటరిగా పోటీచేయొచ్చు కదా?. కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు ఎందుకు?. ఈటలకు ఓన్ గా గెలిచే సీన్ లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.