Congress Party : ఫ్లాష్.. ఫ్లాష్.. : కాంగ్రెస్ పార్టీకి షాక్.. కూలిన ప్రభుత్వం.. సీఎం రాజీనామా..

Congress Party : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరి ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. సర్కారులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండటమే దీనికి కారణం. అక్కడి ప్రభుత్వం ఇవాళ కుప్పకూలింది. అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బల పరీక్షలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని నిరూపించుకోలేకపోయింది. దీంతో వెంటనే శాసన సభ నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి నారాయణస్వామి తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పుదుచ్చెరిలో రాజకీయాలు కీలకమైన మలుపు తిరిగాయి. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది.

రాజీనామాలు..

మొత్తం 33 మంది సభ్యులు కలిగిన పుదుచ్చెరి అసెంబ్లీలో రీసెంటుగా కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. చివరికి 26 మంది మిగిలారు. నారాయణ స్వామి గవర్నమెంట్ బల పరీక్షలో గట్టెక్కాలంటే మొత్తం సభ్యుల్లో సగం కంటే ఒక్కరు ఎక్కువ (14 మంది) ఉన్నా సరిపోతుంది. కానీ హస్తం పార్టీ తరఫున 12 మందే ఉన్నారు. ఇందులో స్పీకర్ తో కలిపి కాంగ్రెస్ వాళ్లు పది మంది కాగా డీఎంకేవాళ్లు ఇద్దరు కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎం నారాయణ స్వామి సైతం రాజీనామా చేయాల్సి వచ్చింది.

Congress Party : congress party governament collapsed
Congress Party : congress party governament collapsed

ప్రతిపక్షం ఓకే: Congress Party

ఒక వైపు అధికార పక్షానికి ఇద్దరు సభ్యుల మెజారిటీ తగ్గగా మరో వైపు ప్రతిపక్ష పార్టీ ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమికి సరిగ్గా సరిపోను సంఖ్యలో (14 మంది) ఎమ్మెల్యేలున్నారు. ఇందులో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఏడుగురు, అన్నాడీఎంకేవాళ్లు నలుగురు, నామినేటెడ్ బీజేపీ శాసన సభ్యులు ముగ్గురున్నారు. పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్ బేడీని ఆ పదవి నుంచి కేంద్రం లేటెస్టుగా తొలగించి, ఆ అదనపు బాధ్యతలను తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కి అప్పగించిన విషయం తెలిసిందే. ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. ఈరోజు సాయంత్రంలోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని నారాయణ స్వామి సర్కారుకు డెడ్ లైన్ పెట్టారు. కానీ ఆ పరీక్షలో ఆయన గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఫలితంగా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందేమో చూడాలి.

Advertisement