CM KCR : సీఎం కేసీఆర్ కి మళ్లీ అనారోగ్యం.. అందుకే..

CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఇది ఈ రోజు జరిగింది కాదు లెండి. నిన్న శనివారం జరిగింది. కాకపోతే ఇవాళ ఎందుకు చెప్పుకుంటున్నామంటే నిన్న ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన 6వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల్లోని 26 మంది ముఖ్యమంత్రులు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాలుపంచుకుంటారని అంతా భావించారు. కానీ, నిన్న రాత్రి వరకు దీనికి సంబంధించిన వార్తలేమీ రాలేదు. దీంతో అసలు ఏమైందనేది ఎవరికీ అర్థంకాలేదు. ఇవాళ పొద్దున పేపర్ లో చూసేదాక గానీ అసలు విషయం తెలియలేదు.. కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారని.

ఇంకెవరెవరు?..

తెలంగాణతోపాటు పంజాబ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ ముఖ్యమంత్రులు కూడా వర్చువల్ విధానంలో జరిగిన ఈ మీటింగుకి రాలేదు. దీనికి అనారోగ్యంతోపాటు ఇతర కారణాలున్నట్లు అధికారులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఏకంగా ఈ భేటీ వేస్ట్ అని, నీతి ఆయోగ్ కి ఆర్థిక అధికారాలు లేవని అనటం గమనార్హం. అయితే తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్ కి బదులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేష్ కుమార్, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రోగ్రెస్ ని, అమలుచేస్తున్న వివిధ పథకాలను వివరించారు.

CM KCR : telangana cm kcr suffered from mild illness
CM KCR : telangana cm kcr suffered from mild illness

ఒక రోజు ముందే: CM KCR

శనివారం నీతి ఆయోగ్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో అందులో ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాల్సిన వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ ఒక రోజు ముందే అంటే శుక్రవారమే ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ భేటీ కోసం సీఎస్ సోమేష్ కుమార్ అప్పటికే అన్ని శాఖల నుంచి నివేదిక తెప్పించుకోగా దాన్ని శుక్రవారం పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొంత సమాచారం తీసుకున్నారు. ఇలా పక్కాగా ప్రిపేర్ అయ్యారు. కానీ.. చివరి నిమిషంలో అనుకోని అసౌకర్యం కలగటంతో సమావేశానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.

Advertisement