CM KCR : ఢిల్లీలో కేసీయార్ ’బీఆర్ఎస్‘ హంగామా : కవిత సరే.! కేటీయార్ ఎక్కడ.?

NQ Staff - December 14, 2022 / 01:32 PM IST

CM KCR : ఢిల్లీలో కేసీయార్ ’బీఆర్ఎస్‘ హంగామా : కవిత సరే.! కేటీయార్ ఎక్కడ.?

CM KCR : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చాక, ఆ పార్టీ అధినేత కేసీయార్ తెలంగాణలో ‘బీఆర్ఎస్’ జెండా ఆవిష్కరించారు. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు. కేసీయార్ అంటేనే యజ్ఞ యాగాదులకు కేరాఫ్ అడ్రస్.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో ప్రత్యేక యాగాలకు శ్రీకారం చుట్టారు.

అయితే, ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న బీఆర్ఎస్ వ్యవహారాల్లో, కేసీయార్ తనయుడు కేటీయార్ హంగామా కనిపించడంలేదు.

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. పదవి మారిందా.?

కేసీయార్ తనయుడు కేటీయార్, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టేనా.? అయితే గనుక, కేసీయార్ వెంట కవిత వున్నట్లుగా, బీఆర్ఎస్ కార్యకలాపాల్లో కేటీయార్ ఎందుకు కనిపించడంలేదట.?

ఈ విషయమై బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత పేరు తెరపైకి వచ్చిన దరిమిలా, దాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించే క్రమంలో అదే ఢిల్లీ వేదికగా కవితతో కేసీయార్ హంగామా చేయిస్తున్నారని అర్థం చేసుకోవాలేమో.

CM KCR Inaugurated BRS National Office In Delhi

CM KCR Inaugurated BRS National Office In Delhi

ఇంకోపక్క కవిత గతంలో ఎంపీగా పని చేశారు. అలా జాతీయ స్థాయి నేతలతో ఆమె రాజకీయంగా సన్నిహిత సంబంధాలేరప్పడ్డాయి. ఆ కోణంలోనూ బీఆర్ఎస్ వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా కవితకు ఢిల్లీ స్థాయి బాధ్యతల్ని కేసీయార్ అప్పగించారని అర్థం చేసుకోవాలేమో.!

కేటీయార్‌కి తెలంగాణ బాధ్యతలు..

CM KCR Inaugurated BRS National Office In Delhi

CM KCR Inaugurated BRS National Office In Delhi

ముఖ్యమంత్రి పదవికి కేటీయార్, కవిత మధ్య గట్టి పోటీ వుందని చాన్నాళ్ళుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, కేసీయార్ తన రాజకీయ వారసుడిగా కేటీయార్‌ని ఇప్పటికే ప్రకటించేశారు ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా.

జాతీయ పార్టీ వ్యవహారాల్లో కేసీయార్ బిజీగా వుండాల్సిందే. ఈ క్రమంలో ఆయనకు జాతీయ స్థాయిలో కవిత సాయంగా వుంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ వ్యవహారాలు, అలాగే ప్రభుత్వ వ్యవహారాల్ని కేటీయార్ చక్కబెడుతున్నారు.

కేటీయార్‌కి హరీష్ రావు పలు అంశాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదిలా వుంటే, ‘కుటుంబ పార్టీ..’ అన్న విమర్శలు రాకుండా వుండేందుకు కూడా, బీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల్లోకి కేటీయార్ రాకుండా కేసీయార్ చూస్తున్నారన్న వాదనా లేకపోలేదు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us