CM KCR : కేసీఆర్.. ఎవరికి బంధువు? ఎలా హిందువు?

CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) పార్ట్ టైమ్ హిందువు మాత్రమేనని, ఫుల్ టైమ్ హిందువు కాదని రాష్ట్ర బీజేపీ ఎద్దేవా చేసింది. టీఆరెస్ అధినేత కూడా అయిన ఆయన.. మాటల్లో మాత్రమే హిందువని, చేతల్లో కాదని విమర్శించింది. అంతేకాదు. అయోధ్య విషయంలో కేసీఆర్ ఎంఐఎం (మజ్లిస్) పార్టీ కి అసలు సిసలు బంధువని దుయ్యబట్టింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి నిన్న రాత్రి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.

మాట్లాడరేం?..

టీఆరెస్ శాసన సభ్యులు, నాయకులు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే పార్టీ అధిపతిగా కేసీఆర్ మారుమాట్లాడకపోవటాన్ని రాములమ్మ తప్పుపట్టారు. ఇంతకీ ఆయన ఆ గుడికి అనుకూలమా? వ్యతిరేకమా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయోధ్య టెంపుల్ విషయం తెర మీదికి వచ్చినప్పుడల్లా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు భద్రాద్రి ఆలయం గురించి ప్రశ్నిస్తున్నారని, తద్వారా టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు.

వాలంటరీగా: CM KCR

రాముడు జన్మించిన భూమి అయిన అయోధ్యలో దేశ ప్రజలందరూ వాళ్లంతటవాళ్లే(వాలంటరీగా) భక్తి ప్రపత్తులతో కోవెల కట్టుకుంటున్నారని ఒకప్పటి ఈ లేడీ సూపర్ స్టార్ పేర్కొన్నారు. యాదాద్రిలాగే భద్రాద్రిని కూడా తెలంగాణ ప్రభుత్వం గొప్పగా తీర్చిదిద్దాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే రాష్ట్ర ప్రజలు నిజంగా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పారు. కానీ.. కేసీఆర్ కి అలా చేయటం ఇష్టంలేదేమోననే డౌటొస్తోందని రాములమ్మ అన్నారు.

CM KCR : clarify your stand on ayodhya temple
CM KCR : clarify your stand on ayodhya temple

ఏడేంటి?.

పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తేనే భద్రాచలంలోని రామాలయం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తానంటూ ముఖ్యమంత్రి తన మంత్రులతో మెలిక పెట్టించటం భావ్యం కాదని బీజేపీ నాయకురాలు హితవు పలికారు. మొన్న కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్, నిన్న పిడమర్తి రవి, ఈరోజు పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి అయోధ్య రామ మందిరం గురించి అవాకులు చెవాకులు పేలుతుంటే మౌనం పాటిస్తున్న తెలంగాణ సీఎం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలని, వంద శాతం హిందువునంటూ నిరూపించుకోవాలని విజయశాంతి నిలదీశారు.

Advertisement