సినిమా కోసం చిరంజీవి అత్యంత ఆత్మీయుడు ఎలా ప్రాణం కోల్పోయాడు..?

Chiranjeevi(చిరంజీవి): సినిమా…మూడక్షరాల ఈ పదం ఎంతో మందికి జీవనాదారం ..ఈ రంగంలో మొత్తం 24 శాఖలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది సినిమాటోగ్రఫీ శాఖ. ఎవరు అందంగా కనబడాలన్న, సీన్ చక్కగా రావాలన్న అది ఒక్క కెమెరా డిపార్ట్మెంట్ మాత్రమే చేయగలదు. లొకేషన్లను అత్యద్భుతంగా చూపిస్తూ, నటీనటులను బ్రహ్మాండంగా ఎలివేట్ చేయగలరు. సినిమా ఎలా వస్తుంది అనేది కూడా ముందుగా తెలిసేది కెమెరా మరియు ఎడిటింగ్ శాఖలకే. కెమెరా పని తనం బాగుంటే సినిమా ఎంతో చక్కని అనుభూతిని ఇస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాకు సినిమాటోగ్రఫీ హార్ట్ లాంటిది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే చాల మంది దర్శకులు ఎప్పుడు ఒకే సినిమాటోగ్రాఫర్ ని మైంటైన్ చేస్తూ ఉంటారు.

ఉదాహరణకు ఎస్. ఎస్ రాజమౌళి కె.కె.సెంథిల్ కుమార్ ని తప్ప మారేవారిని పెట్టుకోడు. ఇక ఇలా గతంలో సైతం పలువురు ఒకే హీరోకు లేదా ఒకే దర్శకునికి పని చేసిన దాఖలాలు ఉన్నాయ్. అందులో ముఖ్యంగా చెప్పకునే హీరో మరియు కెమెరా మెన్ కాంబినేషన్ చిరంజీవి మరియు లోక్ సింగ్. వీరిద్దరూ కలిసి ఏకంగా 31 సినిమాలకు పని చేసారు. కేవలం ఒక సినిమాలకు పని చేయడమే కాదు వీరు ఇద్దరు మంచి స్నేహితులు కూడా. ఒకే కుటుంబం లాగ కలిసి మెలిసి ఉండేవారు కూడా.

Chiranjeevi Lost his best friend చిరంజీవి
Chiranjeevi Lost his best friend

అస్సలు విషయం ఏంటి అంటే కే. బాలచందర్ డైరెక్షన్ లో ‘ఇది కథ కాదు’ సినిమాకు మొదటి సారి లోక్ సింగ్ పని చేసారు. ఆ తర్వాత కోదండరామిరెడ్డి, విశ్వనాథ్ వంటి దిగ్గజ దర్శకులకు వరసగా పని చేసారు లోక్ సింగ్. అయితే 1996లో వార్నింగ్ అనే సినిమా భరత్, ఆమని లీడ్ రోల్స్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాలో జయప్రద సైతం నటించింది. అయితే ఈ సినిమాలో ఫైర్ ఎఫెక్ట్ కోసం సీన్ షూట్ చేయగా, ఒక్కసారిగా పెట్రోల్ ఎక్కువ పోయడం తో ఆ మంటలు ఎత్తుకు ఎగసి పడి లోక్ సింగ్ ని అంటుకున్నాయి. ఈ ఘటన లో లోక్ సింగ్ చాతి, మొహం కి తీవ్రంగా గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించిన అయన కన్ను మూసాడు. ఇలా చిరంజీవి కి అత్యంత ఆత్మీయుడు, సినిమా పైన ప్రేమ ఉన్న లోక్ సింగ్ కన్ను మూయడంతో టాలీవుడ్ దిగ్బ్రాంతికి గురయ్యింది.

Advertisement