కేసీఆర్ గల్లా పట్టుకున్న బండి సంజయ్

Kondala Rao - January 18, 2021 / 09:55 PM IST

కేసీఆర్ గల్లా పట్టుకున్న బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గల్లా పట్టుకున్నాడు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తానంటివి.. ఎప్పుడిస్తావ్’’ అని నిలదీశాడు. ‘‘దళితులకు మూడెకరాల భూమి కూడా ఇస్తానంటివి నా కొడకా.. ఇవ్వకపోతివే’’ అని బండ బూతులు తిట్టాడు. అంతే కాదు. ఇంకా చాలా చాలా విషయాలు అడిగాడు.

ఏంటీ?.. ఇదంతా ఇలలోనే జరిగిందనుకుంటున్నారా?. లేదు. లేదు. కేసీఆర్ కలలో జరిగిందట. ఎవరు చెప్పారు.. కేసీఆర్ ఇంట్లో పనిచేసే వ్యక్తే. ఎవరికి చెప్పాడు.. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కి. ఆయనెప్పుడు ఈ సీక్రెట్ బయట పెట్టాడు?.. ఈరోజే. ఎక్కడ?.. వికారాబాద్ లో. ఎలా చెప్పాడు?.. ఒక కథలాగా పూసగుచ్చినట్లు.

CHANDRASHEKAR 1610459810

కాకపోతే ఇది కరెక్ట్ కథా? లేక కట్టు కథా అనేది మాత్రం ఆయనకే తెలియాలి. ఆగండాగండి.. స్టోరీ ఇంకా అయిపోలేదు. బండి సంజయ్ ఇలా కాలర్ పట్టుకోవటంతో గురక తీస్తూ నిద్రపోతున్న కేసీఆర్ కాస్తా దిగ్గున లేచాడంట. ఆందోళనతో నోరు ఎండిపోవటం వల్ల గబగబా మంచి నీళ్లు తాగాడట. వెంటనే టాయిలెట్ కి కూడా వెళ్లాడట. వెళుతూ.. వెళుతూ.. ‘అరె.. బండి సంజయ్ పేరు వింటేనే నా లుంగీ అంతా తడిసిపోయింది’’ అంటూ భయంతో గజగజా వణికిపోయాడంట.

ఇంత పెద్ద విషయాన్ని కేసీఆర్ ఇంట్లో పనిచేసే మనిషి ఎ.చంద్రశేఖర్ కి ఎందుకు చెప్పాడనే డౌటు మనకు రాకమానదు. ఎందుకు చెప్పాడంటే అతను ఇతనికి బామ్మర్దంట. అదీ సంగతి. కొసమెరుపు ఏంటంటే.. ఈ కథ చెబుతూ ఎ.చంద్రశేఖర్ తాను కొత్తగా చేరిన పార్టీ (బీజేపీ) అధ్యక్షుణ్ని (బండి సంజయ్ ని) అంత పెద్ద సభలో పట్టుకొని బండి సంజయ్ గాడు.. గీడు.. అనేశాడు. పైగా.. కేసీఆర్ కంగారుతో మంచినీళ్లు తాగాడో లేదో కానీ ఈ స్టోరీ చెప్పే క్రమంలో ఎ.చంద్రశేఖర్ మాత్రం మంచి నీళ్లు తాగటం గమనార్హం.

ఒకే గదిలో పడుకోరంట..

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఒకే గదిలో పడుకోరంట. గత 40 ఏళ్లుగా వేర్వేరు గదుల్లోనే పడుకుంటున్నారంట. అందువల్ల ఎ.చంద్రశేఖర్ బామ్మర్దే (పేరు.. బాలి గాడు అంట) కేసీఆర్ రూమ్ లో కింద పడుకుంటాడంట. సీఎంకి ఏదైనా సాయం చేయటానికి. ఆ బామ్మర్ది గాడు ప్రతి సంవత్సరం జనవరిలో ఎ.చంద్రశేఖర్ ఇంటికి వచ్చి ఇనాం తీసుకెళతాడంట. ఈ జనవరిలో కూడా మొన్న వచ్చినప్పుడు ఈ సంగతి మొత్తం ఎ.చంద్రశేఖర్ చెవిలో ఊదాడంట.

KCR wife Shobha

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us