Ap Tdp : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా శిక్ష తప్పదా?..

Ap Tdp: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఆ రాష్ట్ర ప్రజలపై ఇంకా కోపం తగ్గనట్లుంది. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆయన వాళ్లని తప్పుపడుతూనే ఉన్నారు. ఎగేసుకుంటూ వెళ్లి జగన్ కి ఓటేసినందుకు అనుభవించండి అంటూ ఒకసారి, నేను రాత్రింబవళ్లూ కష్టపడి పని చేసినా అర్థంచేసుకోలేదంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్టుగా డిజిటల్ మహానాడు కార్యక్రమంలో కూడా బాబు ఇదే అసంతృప్తిని వెళ్లగక్కారు. హైదరాబాద్ తరహాలో ఏపీలో కూడా డెవలప్మెంట్ చూపించాలనే తాపత్రయంతో పరుగులు తీశానని, దీంతో పార్టీని పట్టించుకోలేకపోయానని, పార్టీకి కనీసం పాతిక శాతం సమయాన్ని కేటాయించినా అధికారం పోయేది కాదని పశ్చాత్తాపపడ్డారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ టాప్ లెవల్ లో ఉండాలంటే టీడీపీ మళ్లీ పవర్ లోకి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ap tdp

అయితే..

ఇదే మహానాడులో చంద్రబాబు ఏపీ పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అపొజిషన్ పార్టీ లీడర్లని టార్గెట్ చేస్తున్నవాళ్లను తాము అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టబోమని, ప్రతిఒక్కరినీ శిక్షించి తీరతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే రెండేళ్లు పూర్తయిందని, ఇంకో మూడేళ్లు ఇట్టే కళ్లు మూసి తెరిచే లోపు గడిచిపోతాయని అన్నారు. టీడీపీ మళ్లీ రూలింగ్ పార్టీ అవుతుందని, ఇప్పుడు తప్పు చేస్తున్న అందరి పని అప్పుడు పడతామని వార్నింగ్ ఇచ్చారు.

ap tdp

ఓటర్లకీ?..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు జగన్ పార్టీకి ఓటేయటం వల్లే ఆయన సీఎం అయ్యారు. తెలుగుదేశం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. దీనికి పరోక్షంగా ప్రజలే కారణం అనేది చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీలా కనిపిస్తోంది. టీడీపీకి ఓటేయకుండా తప్పుచేశారు కాబట్టి, తాము రాజకీయంగా ఇన్ని ఇబ్బందులు పడటానికి ఇన్ డైరెక్టుగా కారణమయ్యారు కాబట్టి ఏపీ పబ్లిక్ ని కూడా చంద్రబాబు విడిచిపెట్టరేమోనని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. తప్పుచేస్తున్న పోలీసులకు పనిష్మెంట్ తప్పదన్నట్లు మాట్లాడుతున్న చంద్రబాబు.. తనను ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చోబెట్టినందుకు ప్రజలను సైతం సాధించకుండా ఉండరని అంటున్నారు. అందువల్ల వచ్చే (2024) శాసన సభ ఎలక్షన్ లో మళ్లీ ఏ పార్టీకి ఓటేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా అని అనలిస్టులు అడుగుతున్నారు. జస్ట్.. కన్ఫర్మేషన్ కోసం.