Boyapati Srinu And Balakrishna : ఎలక్షన్స్‌ని టార్గెట్ చేసిన బాలయ్య, మరోసారి బోయపాటి డైరెక్షన్లో పొలిటికల్‌ మూవీ!

NQ Staff - November 9, 2022 / 07:38 PM IST

Boyapati Srinu And Balakrishna : ఎలక్షన్స్‌ని టార్గెట్ చేసిన బాలయ్య, మరోసారి బోయపాటి డైరెక్షన్లో పొలిటికల్‌ మూవీ!

Boyapati Srinu And Balakrishna : బాలయ్య అంటేనే మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌. బోయపాటి ఊరమాస్‌. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే బాక్సాఫీస్‌ దగ్గర ఏ రేంజ్‌ రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింహా, లెజెండ్, అఖండ ఇలా వీళ్ల కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్‌ బస్టర్లే.

ఈ హ్యాట్రిక్ తర్వాత నాలుగో చిత్రానికి కూడా నాంది పలికే పనుల్లో పడ్డారట వీళ్లిద్దరూ. అయితే ఈసారి రానున్న ఎలక్షన్స్‌ని టార్గెట్‌ చేస్తూ పొలిటికల్‌ ఎంటర్టెయినర్ ప్లాన్‌ చేస్తున్నారట. లెక్క ప్రకారం త్వరగా సినిమా పూర్తి చేసేసి ఎన్నికల సమయంలో రిలీజ్‌ చేయడానికి చూస్తున్నారట.

బోయపాటి డైరెక్ట్ చేసిన లెజెండ్ మూవీ వల్ల పోయిన ఎలక్షన్స్‌ టైమ్‌ లో బాగా కలిసొచ్చింది బాలయ్యకి. పార్టీ ఉద్దేశాల్ని, సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆ చిత్రం బాగా దోహదపడింది. అటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా పుష్కలంగా ఉండి, మాస్‌ అండ్ యాక్షన్‌ సీన్స్‌ పండడంతో బాక్సాఫీస్‌ దగ్గర భారీ హిట్‌ను దక్కించుకుందా చిత్రం. తెలుగుదేశానికి సపోర్టుగా డైలాగులున్నాయనీ, సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని కొన్నిసెంటర్లలో గొడవ జరిగిన దాఖలాలు కూడా లేకపోలేదు.

దాంతో ఈసారి కూడా అలా బోయపాటి మార్క్‌తో ఓ రేంజ్‌ యాక్షన్‌ కంటెంట్ తో పాటు బాలక్రిష్ణ పొలిటికల్‌ కెరీర్ కి కూడా హెల్పయ్యేలా ఓ సినిమా పక్కా రానుందట. నిజానికి బయట ఎంత ప్రచారం చేసినా, ఎన్ని యాత్రలు కవర్ చేసినా, ఎన్ని స్పీచులు దంచినా, చెప్పాలనుకున్న పాయింట్‌ సినిమా ద్వారా జనాల్లోకెళ్లే స్కోప్‌ ఎక్కువే. అందుకే ఈసారి కూడా అదే ఫార్ములాను ఫాలో అవనున్నారట. ఈలెక్కన అఖండ పార్ట్ టూ మరో రెండేళ్ల తర్వాత సెట్స్‌పైకెళ్లే చాన్సులున్నాయి.

వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య సంక్రాంతి బాక్సాఫీస్‌ బరిలోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా మాస్‌ అండ్ యాక్షన్ జానర్‌ కాబట్టి బాలయ్య తన స్టయిల్లో ఆడియెన్స్‌ ను అలరించడం పక్కా. ఆ తర్వాత అన్నీ కుదిరి త్వరలోనే బోయపాటి దర్శకత్వంలో సినిమా పడితే, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా వర్కవుటయితే మరో బ్లాక్‌ బస్టర్‌ గ్యారంటీ. మొత్తానికి ఈ లెక్కన అటు ఫ్యాన్స్‌ను ఎంటర్టెయిన్ చేయడంతో పాటు, ఇటు పొలిటికల్‌ పరంగానూ పనికొచ్చేలా నందమూరి నటసింహం వరుస ప్రాజెక్టులతో జోరు చూయించనున్నాడు.

ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా సినిమాలు, పాలిటిక్స్‌, క్యాన్సర్‌ హాస్పిటల్‌, టాక్‌ షో.. ఇలా అన్నిటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వస్తున్నాడు బాలయ్య. పైగా అఖండ బంపర్‌ హిట్ అవ్వడం, ‘అన్‌ స్టాపబుల్‌’ మంచి రెస్పాన్స్‌తో బాప్ ఆఫ్‌ ఆల్ టాక్‌ షోస్ అనిపించుకోవడం, మరోవైపు అప్‌ కమింగ్ మూవీ వీరసింహారెడ్డి శరవేగం షూటింగ్‌ పార్ట్‌ కంప్లీటవుతుండడం, ఇలా అన్నిరకాలుగా తన జోష్‌ని కంటిన్యూ చేస్తున్నాడు బాలయ్య.

మరి బోయపాటి డైరెక్షన్లో పొలిటికల్‌ మూవీ కూడా చేసి, అటు పాలిటిక్స్‌లోనూ మళ్లీ కలిసొస్తే అనిపించింది అందాం, అనుకున్నది చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం అని తొడగొట్టేస్తాడేమో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us