అనామకుడిగా వెళ్లి.. అందరివాడిగా వచ్చానంటున్న ‘‘పీపుల్స్ విన్నర్’’ సోహెల్ ఫుల్ ఇంటర్వ్యూ

‘బిగ్ బాస్’ రియాల్టీ షో ద్వారా నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనే చిన్న కోరికతో ఆ హౌజులోకి వెళ్లిన సోహెల్ బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఆశించినదానికన్నా రెట్టింపు పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరి చేతా ‘‘అరె మనవాడుర బై’’ అనిపించుకున్నాడు. తద్వారా ‘‘పీపుల్స్ విన్నర్’’గా నిలిచాడు. అతనితో ‘‘న్యూస్ క్యూబ్’’ ఛానల్ హోస్ట్ ధనుష్ చేసిన ఫుల్, ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..