ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పించన్ల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్దులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో ఇప్పటికే వాలంటీర్లు ఇంటికి వెళ్లి పించన్లు ఇచ్చే ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే 1వ తారీకున జీతాలు పడుతున్నాయో అలాగే వృద్దులకు మరియు వికలాంగులకు మరియు అర్హులందరికి కూడా పించన్ల పంపిణీ విషయంలో సమ న్యాయం పాటించాలనే నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పించన్ ఇచ్చే విధానంలో స్వల్ప మార్పు తీసుకు వచ్చి ఇకపై 1, 2, 3 వ తేదీల్లోపు ఇచ్చేయాలని నిర్ణయించారు.

అత్యధికులకు 1వ తారీకున పించన్ ఇస్తారు. ఆ రోజున అందుబాటులో లేని వారికి 2 మరియు 3వ తారీకుల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలతో పాటు కొన్ని మారుమూల ప్రాంతాల్లో గతంలో రెండు రోజులు పించన్ల పంపిణీ చేసేవారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో మూడు రోజులు ఇచ్చే అవకాశంను కల్పించారు. ఈ మూడు రోజుల్లో అంతా కూడా పించన్లను పొందాల్సి ఉంటుందని వాలింటీర్లు అంటున్నారు. ఒకటి లేదా రెండు రోజులు ఏదైనా ప్రాంతానికి వెళ్లినా లేదంటే అందుబాటులో లేకున్నా కూడా పించన్ రాదు అనే ఆందోళన ఉండేది. కాని ఇకపై ఆ ఇబ్బంది ఉండదు.
జగన్ ప్రభుత్వం వృద్దులు మరియు వికాళాంగుల ఇబ్బందులను అర్థం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే 1వ తారీకున పించన్లను ఇవ్వడంతో పాటు అందుబాటులో లేని వారికి తర్వాత రెండు రోజుల్లో ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇది నిజంగా ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పించన్లను అందించే ఉద్దేశ్యంతో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికి ఆనందాన్ని కలిగిస్తుందని కింది స్తాయిలో పని చేస్తున్న వాలంటీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.