Allu Arjun : పుష్ప ప్రొడ్యూసర్ ల మీద మండిపడుతోన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ‘అలా ఎలా చూసుకోలేదు అయ్యా మీరు’ అంటూ ఫైర్!

Allu Arjun : సినిమాల్లోని కొన్ని సీన్లు లీక్ కావటం వెనక రెండు కారణాలుంటాయి. ఒకటి.. మూవీ ప్రమోషన్ కోసం యూనిట్ వాళ్లు కావాలనే ఇలా చేయటం. రెండు.. సినిమాని దెబ్బతీయటం కోసం ప్రత్యర్థులు పనిగట్టుకొని చేయటం. ఇప్పుడెందుకీ ప్రస్తావన అంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఒక పాట తాలూకు బీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలోకి వచ్చేసి వైరల్ అవుతున్నాయి.

లీకెలా?..

ఆరు నిమిషాల నిడివి గల ఈ వీడియో ఎలా లీకైందనేది సినిమా యూనిట్ కి అర్థంకావట్లేదు. పుష్ప షూటింగు ఇప్పుడు అడవుల్లో జరుగుతోంది. బన్నీ ఇంట్రడక్షన్ సాంగ్ ని అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఆ సెటప్ మొత్తాన్ని ఎవరో చెట్ల చాటున దాక్కొని స్మార్ట్ ఫోన్ లో బంధించినట్లు తెలుస్తోంది. కాకపోతే అది ఎవరు చేశారో ఇంకా తేల్లేదు. లేకపోతే షూటింగు చూడటానికి వచ్చినవాళ్లల్లో ఎవరైనా ఈ పనికి పాల్పడ్డారా అని కూడా ఇంటర్నల్ గా విచారణ జరుపుతున్నారు. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ సినిమా ప్రొడ్యూసర్ ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీక్రసీ మెయిన్టెయిన్ చేయాలి కదా, సన్నివేశాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని మండిపడుతున్నారు.

Allu Arjun : bunny latest movie scenes leaked
Allu Arjun : bunny latest movie scenes leaked

గతంలోనూ: Allu Arjun

బన్నీ, సుక్కు కలయికలో రూపొందించిన ఆర్య2 అప్పుడూ ఇలాగే జరిగింది. ‘‘ఉప్పెనంత ఈ ప్రేమకి’’ అనే పాట కూడా లీక్ అయింది. అయినప్పటికీ బొమ్మ అదిరిపోయింది. దీంతో దీన్నొక సెంటిమెంటులా భావించిన సినిమా యూనిట్ పుష్ప సీన్లను ఉద్దేశపూర్వకంగానే మూడో కంటోడికి తెలియకుండా విడుదల చేసిందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం గోల గోల చేస్తున్నారు. ఆ వీడియో పోస్టింగుని సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ సంబంధిత అకౌంట్ హోల్డర్లను డిమాండ్ చేస్తున్నారు. డిలీట్ చేయకపోతే బాగుండదంటూ వార్నింగులు కూడా ఇస్తున్నారు.

Advertisement