ABN-AndhraJyothy : బిగ్ బ్రేకింగ్ : ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చర్చా కార్యక్రమంలో చెప్పుతో కొట్టుకున్న వక్తలు

ABN-AndhraJyothy : ఏబీఎన్-ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ ప్రతిరోజూ రాత్రి ఏదో ఒక అంశంపై ‘ది డిబేట్’ పేరుతో ఒక చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన చర్చ కాస్తా రచ్చ రచ్చగా మారింది. ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితికి చెందిన శ్రీనివాస్ రావు అనే వక్త ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ని చెప్పుతో కొట్టడం సంచలనం రేపింది. అన్ని ఛానళ్లలోనూ రోజూ ఇలాగే గరంగరంగా చర్చలు జరుగుతుంటాయి. అందులో పాల్గొనేవాళ్లు తీవ్ర ఆవేశాలకు గురవుతుంటారు. ఒకానొక దశలో కొట్టుకుంటారా అనేంత కోపం ప్రదర్శించుకుంటూ ఉంటారు. కానీ.. ఈ రోజు (మంగళవారం) అలా భౌతిక దాడికి దిగటం కూడా జరిగిపోయింది. గతంలో.. పదేళ్ల కిందట అనుకుంటా.. అప్పుడు కూడా ఇలాగే వేరే ఇద్దరు వ్యక్తులు తన్నుకున్నారు.

అమరావతిపై..

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాజధాని అమరావతిలోని అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు బ్యాంకుల నుంచి రూ.3000 కోట్లు సేకరించటానికి అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏఎంఆర్డీఏ)కి అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం ఇక అమరావతినే రాజధానిగా కొనసాగించకతప్పని పరిస్థితి నెలకొందని విమర్శిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మొత్తం నలుగురు వక్తలు పాల్గొన్నారు.

విష్ణువర్ధన్ రెడ్డికి: ABN-AndhraJyothy

చర్చలో భాగంగా శ్రీనివాస్ రావుకి, విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య మాటా మాటా పెరిగింది. నీ భాష మార్చుకోమంటూ విష్ణువర్ధన్ రెడ్డి శ్రీనివాస్ రావుకి మూడు నాలుగు సార్లు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న శ్రీనివాస్ రావు చెప్పు తీసుకొని విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేశాడు. దీంతో ప్రోగ్రామ్ కి బ్రేక్ చెప్పారు.

ABN-AndhraJyothy : physical attack in abn andhrajyothy live debate
ABN-AndhraJyothy : physical attack in abn andhrajyothy live debate

గతంలో కూడా..

గతంలో కూడా ఓ తెలుగు టీవీ ఛానల్ లో ఇలాగే కొట్టుకున్నారు. టీఆరెస్ పార్టీ తరఫున పాల్గొన్న బాల్క సుమన్, తెలంగాణ ఉద్యమ అమర వీరుల తరఫున రఘుమారెడ్డి పాల్గొన్నారు. రఘుమారెడ్డి టీఆరెస్ ని తీవ్రంగా విమర్శించటంతో ఆగ్రహం ఆపుకోలేకపోయిన బాల్క సుమన్ అతనిపై చెయ్యి చేసుకున్నాడు. ఆ చర్చా కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు సమన్వయ కర్తగా వ్యవహరించారు.

Advertisement