ZOMBIE REDDY: బుల్లితెర‌పై మ‌రోసారి స‌త్తా చాటిన కుర్ర హీరో చిత్రం.. అవాక్క‌వుతున్న ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు

క‌రోనా వేళ ప్రేక్ష‌కుల‌కు వినోదం దొర‌క్క పిచ్చెక్కిపోతున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు. క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండ‌డంతో జ‌నాలు వినోదం కోసం టీవీ లేదా ఓటీటీని ఆశ్ర‌యించాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో మంచి సినిమాలు ఏవైన టీవీలో ప్ర‌సారం అయితే వాటిని తెగ ఆద‌రిస్తున్నారు. తాజాగా చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ హీరోగా పరిచయమైన చిత్రం ”జాంబీ రెడ్డిని మ‌రోసారి మెచ్చారు. ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది – దక్ష హీరోయిన్లుగా నటించ‌గా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది.

జాంబీ రెడ్డి సినిమాతో తేజ హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమానే ఆయ‌న‌కు మంచి క‌మ‌ర్షియ‌ల్ విజయం అందించింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 9.7 టీఆర్పీ రేటింగ్ సాధించింది. చిన్న సినిమాలలో ఇది మంచి రేటింగ్ అనే చెప్పాలి. ఈ క్రమంలో రీసెంటుగా స్టార్ మా లో రెండోసారి ప్రసారం చేయబడిన జాంబీల సినిమా అదిరిపోయే టీఆర్పీ దక్కించుకుంది. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని రికార్డు స్థాయిలో 8.1 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. సెకండ్ టైం టెలికాస్ట్ లో కూడా ఇంతటి టీఆర్పీ రాబట్టడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇటీవ‌లి కాలంలో స్టార్ హీరో సినిమాలు కూడా ఈ రేంజ్‌లో రేటింగ్ రాబ‌ట్ట‌లేక‌పోయాయి.

బుల్లితెర‌పై ‘జాంబీ రెడ్డి’ చిత్రం చేస్తున్న ర‌చ్చ చూసి ప్రతి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. మ‌న నేటివిటీలో జాంబీల మూవీగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ మెచ్చేలా తెర‌కెక్కించాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తొలిసారి కావ‌డంతో ప్రేక్ష‌కులు మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ‘జాంబీ రెడ్డి’ చిత్రాన్ని ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందించగా.. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. సాయిబాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇందులో హర్షవర్ధన్ – రఘుబాబు – పృథ్వీరాజ్ – గెటప్ శ్రీను – హేమంత్ – హరితేజ – అన్నపూర్ణమ్మ – కిరీటి – రమ రఘు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.