Zombie Reddy రివ్యూ : జాంబీ రెడ్డి – కొత్త ఎక్స్పీరియన్స్ కి బీ రెడీ…!

Zombie reddy review
Zombie reddy movie review

Zombiee Reddy ‘అ!’, ‘కల్కీ’ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరొక ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమస్ అయినా తేజ సజ్జ హీరోగా పరిచయమవుతూ వచ్చిన సినిమా ‘జాంబి రెడ్డి‘. కాయల్ ఆనంది, దక్షా నాగర్కర్, గెటప్ శ్రీను ప్రధానపాత్రలలో నటించిన ఈ చిత్రం తెలుగులోనే మొట్టమొదటి జాంబి సినిమా కావడం విశేషం. అంతేకాకుండా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం……

ఇవి అద్దిరిపోయాయి

ఇంటర్వెల్ బ్యాంగ్ నిజంగా అదిరిపోయింది అనే చెప్పాలి. భారీ అనుభవం ఉన్న యాక్షన్ ఫిలిం దర్శకుడి లాగా ప్రశాంత్ వర్మ ఈ ఎపిసోడ్ తెరకెక్కించాడు. మొదటి భాగం చివరలో ఇంతటి ఇంపాక్ట్ ఉన్న ఎపిసోడ్ రావడం వల్ల థియేటర్ ఒక్కసారిగా ఊపందుకుంటుంది.

ప్రశాంత్ వర్మ తన ఇంతకుముందు సినిమాలలో కామెడీ పెద్దగా ట్రై చేయలేదు. అయితే ఈ సినిమాలో మాత్రం గెటప్ శ్రీను లాంటి మంచి ఆర్టిస్ట్ ను పూర్తిగా వాడేసుకున్నాడు. అతనికి అన్నపూర్ణమ్మ కి మధ్య ఉండే కామెడీ సీన్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. చాలా క్లీన్ అండ్ నీట్ కామెడీతో వీరి ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగా పండాయి.

Zombie reddy
Zombie reddy

టెక్నికల్ గా ప్రశాంత్ వర్మ సత్తా గురించి అందరికీ తెలుసు. ఇక జాంబీస్ తో అతను తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ సినిమాకి హైలైట్లే. ముఖ్యంగా వాటి మేకప్, అవి నడిచే తీరు, దాడి చేసే విధానంలో ఎక్కడా అలసత్వం లేకుండా అన్నీ పర్ఫెక్ట్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉండడం గమనార్హం.

ఇలాంటి మల్టీ డైమెన్షనల్ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎక్స్పోజ్ కావడం అనేది చాలా ఛాలెంజింగ్ అంశం. అయితే కొత్త వారైనప్పటికీ ఈ సినిమాలోని తారాగణం మొత్తం బాగా మెప్పించారు. అంతేకాకుండా రెండవ అర్ధ భాగం అంతా బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

ఇవి తేలిపోయాయి

సినిమా నుండి బయటికి వచ్చిన తర్వాత దాదాపు అందరూ రెండవ అర్ధభాగం గురించే మాట్లాడుకుంటున్నారు కానీ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. మొదటి అర్ధ భాగం ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కనీసం రెండవ అర్ధ భాగం కి సపోర్ట్ గా ఒకటి రెండు మూడు కీలక సన్నివేశాలు ఉన్నా బాగుండేది.

రెండు ప్రయోగాత్మక చిత్రాలు తీసిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో మళ్లీ తాను ఎలాంటి దర్శకుడిని అని ప్రూవ్ చేసుకుందాం అనే థ్యాస లో కథనం పరంగా పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు అనిపించలేదు. మంచి విజువల్స్, మేకింగ్ లతో జాంబి లను అదిరిపోయే స్థాయిలో చూపించిన ప్రశాంత్ వర్మ కథనం పై మరింత వర్కవుట్ చేసుంటే భారీ హిట్ అందుకునేవాడు.

సినిమాలో క్లైమాక్స్ భాగంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి కానీ కథకు చివర్లో జస్టిఫికేషన్ మాత్రం రాలేదు. క్లైమాక్స్ భాగం మరింత ఎఫెక్టివ్ గా, లాజికల్ గా పెట్టి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.

అసలెంటే జాంబీ రెడ్డి…?

కరోనా వైరస్ భారత దేశం లోకి అడుగు పెట్టిన తర్వాత నరేంద్ర మోడీ లాక్ డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ఇందులో ఒక సైంటిస్ట్ కోవిడ్ కు వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంటాడు. ఇదంతా పక్కన పెడితే మన హీరో తేజ సజ్జ, దక్షా నాగర్కర్, కిరీటి, ఆర్జే హేమంత్ అందరూ మంచి ఫ్రెండ్స్. ఇక వీరందరి ప్రొఫెషన్ గేమింగ్ డిజైనర్స్. లాక్ డౌన్ సమయంలో వారిలో ఒకరైన హేమంత్ పెళ్లి కోసం అందరూ కర్నూలు బయలుదేరుతారు. ఇందాక మనం చెప్పుకున్న సైంటిస్ట్ తయారు చేసిన వ్యాక్సిన్ వికటించి అదే సమయానికి అక్కడ ఉన్న కొంతమంది మనుషులు జాంబీలు గా మారుతారు. ఇంటర్వల్ సమయానికి తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను. ఆర్జే హేమంత్ తప్ప ఊర్లోని వారంతా జాంబీలు అయిపోతారు. ఇక ఈ ఐదుగురు జాంబీల నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నారా…? అసలు మిగిలిన వారిని మామూలు మనుషులుగా మార్చేందుకు సొల్యూషన్ దొరికిందా….? లేదా వీరే చివరికి జాంబీలుగా మారిపోయారా? అన్నదే కథ.

అనాలసిస్

తేజ సజ్జ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. ఇక అతనికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ వంతు న్యాయం చేశారు. సినిమా మొదటి భాగం ముందుగా చెప్పుకున్నట్లు పెద్దగా లేక పోయినా రెండో భాగం గురించి మాత్రం అందరూ మాట్లాడుకుంటారు. సెకండాఫ్ మొత్తం ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అయితే జాంబీ జోనర్ సినిమాకు తెలుగు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ అది మరీ రొటీన్ గా ఉండడం తో మొదటి భాగం బాగా భరించాలి. కానీ రెండో భాగం ఫన్ తో నిండిపోయి అప్పటివరకూ వచ్చిన విసుగుని కవర్ చేస్తుండి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు లేదా గతంలో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమాలు అన్నింటిలో ఈ జాంబీ ఫిలిం చాలా కొత్తగా, రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఎలివేషన్స్ కూడాఅ అద్భుతంగా తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం అటు ఇటు గా ఉంది. చాలా మందిని క్లైమాక్స్ అయితే లాజిక్ లేకుండా నిరాశపరిచింది…. కొంతమంది అయితే ఓకే పర్లేదు అని అన్నారు. విజ్యువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా టాప్ లెవల్ లో ఉంది. మొత్తానికి ఇది ఒక ఫన్ ఫిల్ల్డ్ థ్రిలింగ్ జాంబీ ఫిలిం. ఒకసారి కచ్చితంగా చూడవచ్చు. రెండవసారి దానిలో సదరు ప్రేక్షకుడికి నచ్చే అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది.

రేటింగ్: 3/5

Advertisement