Balakrishna: బాల‌య్య‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన ఇండియ‌న్ క్రికెట‌ర్

Balakrishna: త‌న సినిమాల‌తోనే కాక సేవా కార్య‌క్ర‌మాల‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. హిందూపురం ఎమ్మేల్యే అయిన బాల‌య్య ప్ర‌జ‌ల‌తో ఎక్కువ‌గా మ‌మేకం అవుతున్నారు. అభిమానులు ఆయ‌న‌ని ముద్దుగా నంద‌మూరి న‌ట‌సింహం అని పిలుచుకుంటారు. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్న బాల‌య్య ఈ రోజు త‌న 61వ బ‌ర్త్‌డేని జ‌రుపుకుంటున్నారు.

Balakrishna

ప్ర‌తి ఏడాది బాల‌య్య బ‌ర్త్‌డేని ఆయ‌న అభిమానులు ఘ‌నంగా జ‌రిపేవారు.కాని ఈ సారి క‌రోనా ఉదృతి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న ఎవ‌రు కూడా అలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టొద్ద‌ని పిలుపునిచ్చారు. అభిమానులు మీ ప్రియ‌మైన వారితో ఇంట్లోనే ఉంటే అదే మీరు నాకిచ్చే బ‌హుమ‌తి అని ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌నలో తెలిపారు. అయితే బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా నేడు సోషల్ మీడియా ఊగిపోతోంది. HappyBirthdayNBK, Akhanda హ్యాష్ ట్యాగ్‌లతో బాలయ్య బాబు బర్త్ డే నెట్టింట్లో హల్చల్ అవుతోంది. ఈ క్రమంలో బాలయ్య బాబు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.

బాల‌య్య త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానుల‌కు స‌ర్‌ప్రైజెస్ ఇచ్చారు.త‌ను న‌టిస్తున్న అఖండ సినిమాకు సంబంధించిన లుక్ విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా, గోపిచంద్ మ‌లినేనితో చేయ‌నున్న 107వ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశాడు. అనీల్ రావిపూడి సినిమాకు సంబంధించన ప్ర‌క‌ట‌న కూడా వ‌స్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. దానిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే బాల‌య్య కెరీర్‌లో స‌మ‌రసింహార‌డెడ్డి, నర‌సింహా నాయుడు చిత్రాలు ఎంత పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేశాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు.

న‌ర‌సింహా నాయుడు చిత్రం త‌ర్వాత బాల‌య్య మంచి హిట్ కోసం ప‌దేళ్లు వేచి చూవాడు. బోయపాటి తెరకెక్కించిన సింహా సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. ఆ ఏడాదిలో సింహా సినిమా హయ్యస్ట్ కలెక్షన్లతో రికార్డుల మోత మోగించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమా దుమ్ములేపేసింది. ఇక చివరగా బాలయ్య రూలర్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు. ఇక ఇప్పుడు మళ్లీ బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాకు అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Balakrishna

అయితే బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ,క్రీడా ప్ర‌ముఖుల నుండి పెద్ద ఎత్తున విషెస్ వ‌స్తుండ‌గా, ఊహించ‌ని విధంగా భార‌త డాషింగ్ బ్యాట్స్ మెన్ యువ‌రాజ్ సింగ్ త‌న ట్విట్టర్‌లో బాల‌య్య‌తో క‌లిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ విషెస్ తెలిపారు . బాలకృష్ణ సార్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాను. ఎంటర్టైనింగ్ పెర్ఫామెన్స్ తో పాటు సామజిక కార్యాలతో మరింత మందిని ప్రభావితం చెయ్యాలని కోరుకుంటున్నాని” యువరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. యువ‌రాజ్ ట్వీట్‌తో బాల‌య్య అభిమానుల‌లో జోష్ మ‌రింత పెరిగింది.