Singer Mangli : సింగర్ మంగ్లీకి జగనన్న కానుక

NQ Staff - November 22, 2022 / 10:32 AM IST

Singer Mangli : సింగర్ మంగ్లీకి జగనన్న కానుక

Singer Mangli : ఒక టీవీ ఛానల్ యాంకర్ గా కెరియర్ ని ఆరంభించిన మంగ్లీ తనదైన గాత్రంతో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించి ముఖ్యంగా తెలంగాణ యాసతో బతుకమ్మ పాటలను పాడుతూ అందరిని దృష్టిని ఆకర్షించింది.

మంగ్లీ ఏపీ ప్రభుత్వం తో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఏపీ ప్రభుత్వం సింగర్ మంగ్లీ కి ఎస్వీబీసీ ఛానల్ యొక్క సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ ఉత్తర్వులు వచ్చినప్పటికీ మంగ్లీ బాధ్యతలు స్వీకరించడంలో ఆలస్యమైంది.

ఎట్టకేలకు మంగ్లీ బాధ్యతలు స్వీకరించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ విధులు నిర్వర్తించేందుకు గాను మంగ్లీకి నెలకు లక్ష రూపాయల వేతనం ను ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

జానపద, సినిమా పాటలు పాడుతూ మంచి గాయినిగా గుర్తింపు దక్కించుకుంది. 2020 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారుని విశిష్ట మహిళా పురస్కారం అందుకున్న మంగ్లీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం భక్తి ఛానల్ యొక్క సలహాదారుగా ఎంపిక అవడంతో మరింత గౌరవాన్ని సొంతం చేసుకుంది.

ఒక చిన్న తండాలో పుట్టిన మంగ్లీ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికో అన్నట్లుగా సాగింది. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తన పేరు ప్రఖ్యాతలను పెంచుకున్న మంగ్లీ ఇప్పుడు పొందిన ఈ గౌరవానికి పూర్తి అర్హురాలు అంటూ ఆమె సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us