Shanmukh: 15 ల‌క్ష‌ల ల‌గ్జ‌రీ కారు కొన్న యూట్యూబ్ స్టార్.. నెటిజ‌న్స్ ట్రోలింగ్

Shanmukh: సోష‌ల్ మీడియాతో ఫుల్ పాపుల‌ర్ అయిన యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్. ‘వైవా’ అనే షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిన జ‌శ్వంత్ ఆ తర్వాత పలు డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి ఆదరణ పొందాడు. షణ్ముఖ్ తాను నటించిన ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. సూర్య వెబ్ సిరీస్‌తో ఆయ‌న క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది. తెలుగు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ కవర్ చేస్తూ కూడా గుర్తింపు పొందాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కోటి 20 లక్షల మంది ఫాలోవర్స్ సొంతం చేసుకున్న షణ్ముఖ్ ఇటీవ‌ల ఓ వివాదంలో నిలిచాడు.

Shanmukh

ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ ఇటీవల మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో అదుపుత‌ప్పి మ‌రో రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన షణ్ముఖ్‌ జశ్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 170 రీడింగ్ వచ్చింది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ త‌ర్వాత ష‌ణ్ముఖ్ ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

దీప్తి సున‌య‌న‌తో ఎఫైర్ విష‌యంతోను మ‌నోడు బాగా పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. బిగ్ బాస్ షోలో దీప్తి సునయన ఎక్కువగా షణ్ముఖ్ గురించి చెబుతూ ఉండేది. అలా దీప్తి సునయన షణ్ముఖ్ జోడికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తమ జంటపై ఎన్ని రూమర్లు వచ్చినా కూడా దీప్తి సునయన షణ్ముఖ్‌లు ఎక్కడా కూడా స్పందించరు. అయితే దీప్తి సునయన హద్దులు మీరి పర్ఫామెన్స్‌లు చేసిన ప్రతీసారి అందరూ షణ్ముఖ్‌ పేరును ప్రస్తావిస్తారు. అతడినే టార్గెట్ చేసి కామెంట్లు పెడుతుంటారు.

Shanmukh

ఇటీవ‌ల షణ్ముఖ్ న‌టించిన సూర్య వెబ్ సిరీస్ బాగా క్లిక్ అవ్వడంతో జోష్‌లో ఉన్న షణ్ముఖ్ కొత్త కారు కొన్నారు. దాదాపు 15 లక్షలు పెట్టి ల‌గ్జరీ కారును కొన్నట్టు తెలుస్తోంది. ఇది నేను హై.. ఇది నా కొత్త కారు హై.. పార్టీలు లేవు హై అంటూ తన స్టైల్లో సెటైర్ వేశాడు. అయితే ఇలా కొత్త కారు కొనడం, వెనకలా నంబర్ ప్లేట్‌ను బ్లర్ చేయడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్ప‌టికైన జాగ్ర‌త్త‌గా ఉండు, కారు న‌డిపే స‌మ‌యంలో మందు తాగ‌కు అని ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.