Young Tiger NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్ రేంజ్ అంతలా పడిపోయిందా.?

NQ Staff - November 24, 2022 / 05:52 PM IST

Young Tiger NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్ రేంజ్ అంతలా పడిపోయిందా.?

Young Tiger NTR : సినిమాల పరంగా చూసుకుంటే యంగ్ టైగర్ ఎన్టీయార్ ఒకింత డైలమాలో పడిపోయినమాట వాస్తవం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కారణంగా చాలా సినిమాల్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా జరుగుతున్న సమయంలోనే చరణ్ ‘ఆచార్య’ సినిమా చేసేశాడు. ‘శంకర్ దర్శకత్వంలో’ సినిమాని కూడా పట్టాలెక్కించేశాడు.

యంగ్ టైగర్ ఎన్టీయార్ మాత్రం, ఇంకా తన తదుపరి సినిమాని పట్టాలెక్కించలేక పోయాడు. సినిమాల సంగతిలా వుంటే, కమర్షియల్ యాడ్స్ చేయడం లోనూ యంగ్ టైగర్ ఎన్టీయార్ చాలా చాలా వెనకబడి పోతున్నాడు.

మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. తోపు.!

కమర్షియల్ యాడ్స్ చేయడంలో అల్లు అర్జున్ చాలా దూకుడుతో వున్నాడు. ఆ తర్వాతి స్థానం మహేష్‌బాబుదే. రామ్ చరణ్ తక్కువేమీ తినలేదు. ఈ ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీ.. అన్నట్లుంది పరిస్థితి. దాదాపు 8 కోట్లు ఒక్కో యాడ్ కోసం ఈ ముగ్గురూ వసూలు చేస్తున్నారట. ఏడెనిమది కోట్ల వరకూ వీరి రెమ్యునరేషన్ పలుకుతోంది.

కానీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ మాత్రం కేవలం 2 కోట్లతో సరిపెట్టుకున్నాడట. అలా చేసిన యాడ్ ఈ మధ్యనే వచ్చిన సంగతి తెలిసిందే. అదీ ఒక్కటి మాత్రమే. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ అలా కాదు.. ఎడా పెడా కమర్షియల్ యాడ్స్ చేసేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us