Chiranjeevi: చిరంజీవి సినిమా టైటిల్స్‌పై యువ హీరోల మోజు..!

Chiranjeevi: పాత టైటిల్స్ ను కొత్త సినిమాల కోసం వాడుకోవడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇప్పటికప్పుడు కొత్త సినిమాలకు టైటిల్స్ అన్నీ కొత్తగానే పెట్టాలంటే కుదిరే పని కాదు. కొన్ని సినిమాలకు కథ అనుగుణంగా పాత టైటిల్స్ తిప్పి తిప్పి వాడుకుంటారు దర్శక నిర్మాతలు. అందులో ముఖ్యంగా ఈ తరం హీరోలు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్ వాడుకుంటున్నారు.

మెగా హీరోలు అయితే టైటిల్స్‌తో పాటు చిరంజీవి సినిమాలలోని పాట‌లు వాడుకుంటున్నారు. ముఖ్యంగా సాయి ధ‌ర‌మ్ తేజ్ వ‌రుస‌గా చిరంజీవి సినిమాలలోని పాట‌ల‌ను రీమేక్ చేసి విమ‌ర్శ‌ల పాల‌య్యాడు.దాంతో రాను రాను ఆ ట్రెండ్‌ని త‌గ్గించేశాడు. ఇక మ‌న హీరోలే కాదు ప‌క్క ఇండ‌స్ట్రీల‌కి సంబంధించిన హీరోలు కూడా చిరంజీవి సినిమా టైటిల్స్‌పై క‌న్నేస్తున్నారు.

అల్లరి నరేష్ లాంటి హీరోల నుంచి కార్తి, విజయ్ లాంటి స్టార్ హీరోల వరకు కూడా అంతా చిరు ఓల్డ్ టైటిల్స్ పై పడుతున్నారు. ఇప్పుడు కూడా కార్తికేయ ఇదే చేసాడు. రాజా విక్రమార్క అంటూ ఈయన ఓ సినిమాలో నటిస్తున్నాడు. వినాయక్ శిష్యుడు శ్రీ సిరిపల్లి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా,ఇందులో కార్తికేయ చాలా లుక్‌లో క‌నిపించాడు. అయితే కార్తికేయ కంటే ముందు దాదాపు 12 మంది హీరోలు చిరు పాత టైటిల్స్ వాడుకున్నారు. వాళ్లెవరో చూద్దాం..

1. రాజా విక్రమార్క: ఆర్ఎక్స్ 100 కార్తికేయ
2. ముగ్గురు మొనగాళ్లు: కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి
3. దొంగ: తమిళ హీరో కార్తి
4. ఖైదీ: తమిళ హీరో కార్తి
5. మాస్టర్: దళపతి విజయ్
6. యముడికి మొగుడు: అల్లరి నరేష్
7. గ్యాంగ్ లీడర్: నాచురల్ స్టార్ నాని
8. స్టేట్ రౌడీ: శివాజీ
9. రాక్షసుడు: బెల్లంకొండ శ్రీనివాస్
10. హీరో: నితిన్
11. విజేత: చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్
12. గూడఛారి నెం 1: యాక్షన్ కింగ్ అర్జున్
13. ప్రాణం ఖరీదు
14. పున్నమి నాగు: ముమైత్ ఖాన్
15. బిల్లా రంగా