Surekha Vani: భ‌ర్త జ‌యంతి.. నా స‌క్సెస్ వెనుక నువ్వే అంటూ సురేఖ పోస్ట్

Surekha Vani: సురేఖా వాణి.. ఇటీవ‌లి కాలంలో బాగా ఫేమ‌స్ అయిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ . అప్ప‌ట్లో అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న‌ సురేఖా ఇప్పుడు వెండితెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్‌ని మాత్రం అలరిస్తూ వ‌స్తుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు షేర్ చేస్తూనే అభిమానులతో చిట్ చాట్ చేస్తూ నిత్యం టచ్‌లో ఉండటం ఇప్పుడు త‌న హాబీగా పెట్టుకుంది సురేఖా వాణి.

Surekha Vani
Surekha Vani

అప్పుడప్పుడు త‌న అంద‌చందాల‌తో నెటిజ‌న్స్‌ని అల‌రించ‌డ‌మే కాకుండా సంతోషాలు, బాధ‌లు కూడా పంచుకుంటుంది. ఇప్ప‌టికే త‌న భ‌ర్త‌కి సంబంధించి అనేక సార్లు ఎమోష‌న‌ల్‌గా ఫీలైన సురేఖా వాణి ఈ రోజు త‌న భ‌ర్త జ‌యంతి సంద‌ర్భంగా పోస్ట్ పెట్టింది. ”నా సక్సెస్, మంచితనం వెనుక ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వే.. ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటా.. హ్యాపీ బర్త్ డే చిన్నా” అంటూ సురేష్ తేజ ఫొటో పోస్ట్ చేసింది.

సురేష్ తేజను ప్రేమించి పెళ్లాడింది సురేఖావాణి. నేడు ఆయన తనతో లేకపోయినా ఆ ప్రేమ మాత్రం అలాగే ఉంది అని తన మనసులోని భావాన్ని ఇలా వ్యక్తపరిచింది సురేఖ. మరోవైపు సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా త‌న తండ్రి లేడ‌నే విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతుంది. ఇటీవ‌ల త‌న తండ్రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా సుప్రిత ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టిన విష‌యం తెలిసిందే.

బయటకు ఎంతో హుషారుగా కనిపించినా సురేఖావాణి జీవితంలో కూడా ఎన్నో కష్టనష్టాలున్నాయి. గత రెండేళ్ల క్రిందట భర్త సురేష్ తేజ మరణంతో కృంగిపోయింది సురేఖ. భర్త మరణం తర్వాత తనను అత్తారింటి వాళ్ళు అపార్థం చేసుకున్నారని, కొన్ని మనస్పర్థల కారణంగా అత్తింటి కుటుంబం తమతో దూరంగా ఉంటోందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని సురేఖావాణి చెప్పింది.

ఇక భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత సురేఖా వాణి రెండో పెళ్లిపై అనేక పుకార్లు వ‌చ్చాయి. వాటిపై గ‌ట్టిగానే స్పందించింది సురేఖా. ఆ రెండో వాడు ఎవడో కూడా మీరే చెప్పండి అంటూ రూమర్లను తిప్పికొట్టింది. ఇక ఇదే విషయమై సురేఖావాణి కూతురు కూడా గట్టిగానే స్పందించింది. ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఇలాంటి వార్తలు పుట్టించడం సమాజానికి అంత మంచిది కాదంటూ గాసిప్ రాయుళ్లకు గడ్డి పెట్టింది.