YCP : నందమూరి బాలకృష్ణపై వైసీపీ కౌంటర్ ఎటాక్.!
NQ Staff - January 6, 2023 / 11:01 PM IST

YCP : ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’ అనే డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ.. పెద్ద రచ్చే జరుగుతోందిప్పుడు.
వైఎస్ జగన్ మీదనే బాలకృష్ణ ఈ పొలిటికల్ డైలాగ్ పేల్చారనీ, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ విషయమై వైసీపీ సర్కారు తీసుకున్న పేరు మార్పు నిర్ణయాన్ని ఈ పొలిటికల్ డైలాగ్‌తో బాలయ్య తప్పు పట్టారనీ ఓ చర్చ నడుస్తోంది.
వైసీపీ కౌంటర్ ఎటాక్ మామూలుగా లేదు..
‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో అనే డైలాగ్ చెప్పడం ఏముంది బాలయ్య.. అదే సంతకం కోసం ఎక్స్‌ట్రా షోస్ వేసుకోవచ్చని నెల రోజుల నుంచీ నీ ప్రొడ్యూసర్స్ సీఎం ఆఫీస్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు చూడు.. అది మొగాడి లెక్క.. జై జగన్’ అంటూ వైసీపీ నేత ధూళిపాళ్ళ శ్రీనాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కాగా, వైసీపీ మద్దతుదారులే బాలయ్య డైలాగుని చంద్రబాబు మీద అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. ‘చంద్రబాబు నీన్నే బాలకృష్ణ తిట్టారు’ అంటూ వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు కొందరు అంటోంటే, కాదు బాలయ్య తిట్టింది జగన్ మోహన్ రెడ్డినేనని కొందరు వైసీపీ నేతల ట్వీట్స్ ద్వారా ఇస్తున్న రియాక్షన్స్ బట్టి తెలుస్తుంది