Yatra 2 : ఎన్నికలకు ముందే యాత్ర-2 రిలీజ్ చేస్తా.. మహి వి రాఘవ్ ప్రకటన..!
NQ Staff - June 9, 2023 / 11:05 AM IST

Yatra 2 : ఈ నడుమ డైరెక్టర్ మహి వి రాఘవ్ బాగా పాపులర్ అవుతున్నారు. గతంలో ఆయన తీసిన యాత్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను ఆయన సినిమాగా తీసి సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమాలో వైఎస్ జగన్ పాత్ర అస్సలు లేదు. కానీ ఆ సినిమా అప్పట్లో జగన్ కు పాజిటివ్ వేవ్ వచ్చేలా చేసిందని మాత్రం చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలోనే మహి వి రాఘవ్ డైరెక్షన్ లోనే యాత్ర-2 కూడా రాబోతోంది. ఈ సినిమాపై గతంలోనే ప్రకటన చేశాడు రాఘవ్. అయితే దానిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను కచ్చితంగా వచ్చే ఎలక్షన్లలోపే రిలీజ్ చేస్తాం. ఈ సినిమాలో 2009 నుంచి 2019 వరకు జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు, పార్టీని నడిపించి గెలిచిన తీరు గురించి వివరించబోతున్నాం.
కానీ జగన్ పాలనను మాత్రం ఇందులో చూపించను. కేవలం ఆయన పడిన ఇబ్బందుల చుట్టే సినిమా తీస్తాను. ఈ సినిమాలో నటించేందుకు తెలుగు హీరోలు ధైర్యం చేయరు. ప్రస్తుతం తమిళ హీరో జీవా పేరు పరిశీలనలో ఉంది. ఇంకా ఫైనల్ కాలేదు అంటూ తెలిపాడు రాఘవ్.
అయితే రీసెంట్ గానే సైతాన్ సినిమాను తెరకెక్కించాడు రాఘవ్. ఇందులో ఘోరమైన బూతులు, హింస ఉన్నాయి. దాంతో రాఘవ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ సినిమాను ఆయన తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు వైసీపీ నేతలు. కానీ యాత్ర సినిమాను తీసినట్టే జగన్ పాదయాత్ర ను కూడా అద్భుతంగా తీస్తాడని అది వచ్చే ఎలక్షన్లకు పని చేస్తుందని అనుకుంటున్నారు వైసీపీ అగ్ర నేతలు.