KGF 2: కేజీఎఫ్ 2 రిలీజ్ రోజు సెల‌వు కావాలంటూ మోదీకు లేఖ‌..!

KGF 2 బాహుబ‌లి సినిమా త‌ర్వాత అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సౌత్ మూవీ కేజీఎఫ్ 2. య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. క‌రోనా వ‌ల‌న చిత్ర షూటింగ్‌తో పాటు రిలీజ్ డేట్ వాయిదా ప‌డ‌గా, ఎట్ట‌కేలకు జూలై 16న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దాదాపు 140 నుంచి 160 కోట్ల బ‌డ్జెట్‌తో మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, కొన్ని ప్యాచ్ వర్కులు మాత్రం మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌కు సిద్ధం అవుతున్న కేజీఎఫ్ 2 ,ఇత్రంలో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండ‌డంతో సినిమా పై దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెలకొంది. సంజ‌య్ ద‌త్ అధీరా అనే పాత్ర‌లో అల‌రించ‌నున్నాడు. ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, రావు ర‌మేష్ వంటి ప్ర‌ముఖ న‌టులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. చిత్ర హీరో య‌ష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. విడుద‌లైన 48 గంటల్లోపే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు 5.5 మిలియన్స్ కు పైగా లైకులు కూడా సంపాదించింది. ఓ క‌న్న‌డ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఇంత‌గా ఎదురు చూస్తున్నారంటే తొలి పార్ట్ సృష్టించిన ప్ర‌భంజ‌నం ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు.

కేజీఎఫ్ 2 కోసం క‌న్న‌డిగులే కాదు తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డంతో తొలి రోజే సినిమాని చూసేయాల‌ని స్కెచ్ వేసుకుంటున్నారు. కొంద‌రైతే భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకు కేజీఎఫ్ 2 రిలీజ్ రోజు సెల‌వు ప్ర‌క‌టించాల‌ని విన‌తులు పంపిస్తున్నారు. ఇందులో భాగంగా రాశీభాయ్ య‌ష్ ఫ్యాన్ ఒక‌రు జూలై 16న దేశ వ్యాప్తంగా సెల‌వు ప్ర‌క‌టించాల‌ని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గ‌తంలో ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల రిలీజ్ రోజు కూడా సెల‌వులు ప్ర‌క‌టించాల‌ని కొందరు అభిమానులు లేఖ‌లు రాసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement