మరో స్టార్ హీరోయిన్ రహస్య వివాహం.. ఎవరో తెలుసా!!

ఇటీవల కాలంలో కరోనా లాక్ డౌన్ వల్ల హీరో హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత, ప్రముఖ పారిశ్రామిక వేత్తను వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయం తన అభిమానులకు చాలా లేట్ గా తెలిపారు. దీంతో నెటిజన్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆమె పెళ్ళి ఫోటోలు చూసి. దీంతో తాను అంత హడావిడిగా ఎందుకు పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందో సోషల్ మీడియాలో క్లియర్ గా ఓ పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు ఆమె వివాహానికి సంతోషించి ఆశీర్వదించారు. ఇక ఇప్పుడు యామీ గౌతమ్.. తన పెళ్ళి ఫోటోలతో షాక్ ఇచ్చారు. కొద్ది సేపటి క్రితం సోషల్ మీడియాలో ఆమె పెళ్ళి విషయాన్ని ప్రస్తావించారు.

యామీ గౌతమ్ ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్ కి ఫేమస్ మోడల్. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్. టాలీవుడ్ లో నువ్విలా, గౌరవం, యుద్ధం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. యంగ్ హీరో నితిన్ కు జోడీగా కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో నటించి మెప్పించారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేశారు. ఇక ఎప్పటికప్పుడు నెటిజన్లతో, సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్ని తన అభిమానులతో పంచుకుంటారు. అలాంటిది సడెన్ గా సోషల్ మీడియాలో యామీ వెడ్డింగ్ ఫోటోలతో దర్శనమిచ్చి సర్ప్రైజ్ చేశారు.

తాను వివాహం చేసుకున్నానని.. మీరంతా ఆశీర్వదించాలంటూ ఫోటోలు అప్ లోడ్ చేశారు. దీంతో ఆమె అభిమానులు కూడా షాక్ అయ్యారు. యామీ గౌతమ్ పెళ్ళి చేసుకున్న వ్యక్తి ఆదిత్య అని తెలుస్తుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. పెద్దల ఆశీర్వాదంతో తమ పెళ్ళి చాలా సింపుల్ గా అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో జరిగిందని తెలిపారు. ఇంకేం నెక్ట్స్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో పలు యంగ్ హీరోహీరోయిన్ల పెళ్ళిళ్ళు సీక్రెట్ గా జరుగుతాయేమో వేచి చూడాలి.