Ajith: స్టార్ హీరో ఇంటి ముందు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్న యువ‌తి

Ajith: సినిమా స్టార్స్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారి కోసం ప్రాణాలు తీసుకోవ‌డం కూడా చేస్తుంటారు. కొంద‌రు అభిమానంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేస్తుంటే మ‌రి కొంద‌రు ఆవేశంతో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటి ముందు ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది.

Woman who tried committing suicide in front of Ajith's house gets arrested
Woman who tried committing suicide in front of Ajith’s house gets arrested

అజిత్ ను కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా కుదరలేదని.. తన చావుకు కారణం అజిత్ అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సదురు మహిళ ఒంటిపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకున్నారు. ఫర్జానా అనే మహిళ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్నారు. గత ఏడాది కరోనా సమయంలో అజిత్ షాలిని అదే ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఫర్జానా అజిత్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అప్పట్లో వీడియో వైరల్ అయ్యింది. అజిత్ కరోనా బారిన పడ్డాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. హాస్పిటల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఫర్జానా ప్రవర్తించిందని.. ఆమెను ఉద్యోగంలోంచి తీసేశారు. అయితే అజిత్ ను కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకోవడానికి చాలా సార్లు ఆయన ఇంటికెళ్లినా కలవలేదు. ఈ నేపథ్యంలోనే తనకు న్యాయం చేయాలంటూ తాజాగా ఆయన ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది

అజిత్ సినిమాలు వందల కోట్లలో వసూళ్లు సాధిస్తుంటాయి. తెలుగు నాట కూడా అజిత్ కు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘వాలిమై’ షూటింగ్ ను ఇటీవల హైదరాబాద్ లోనే తీశారు. అజిత్ వివాదాల జోలికి వెళ్లకుండా తన ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతుంటారు.