Will Vijay dalapati keep his word : మాట నిలబెట్టుకోలేని చిరు, పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు విజయ్ దళపతి ఏం చేస్తాడో..!

NQ Staff - February 3, 2024 / 01:21 PM IST

Will Vijay dalapati keep his word : మాట నిలబెట్టుకోలేని చిరు, పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు విజయ్ దళపతి ఏం చేస్తాడో..!

Will Vijay dalapati keep his word : సినిమాల్లో స్టార్ హీరో అవడం అంటే పెట్టి పుట్టాలి. అది అంత ఈజీగా దక్కేది కాదు. కోటి మందిలో ఒకరో ఇద్దరో మాత్రమే అవుతుంటారు. ఇక స్టార్ హీరో కావాలంటే బోలెడంత ట్యాలెంట్ ఉండాలి. దాంతో పాటు కాలం కలిసి రావాలి. అదృష్టం వెంటే ఉండాలి. ఇవన్నీ జరిగితేనే స్టార్ హీరోలు అవుతారు. కాగా స్టార్ హీరోలు అయిన చాలా మంది రాజకీయాల్లో రాణించాలని ఆశ పడ్డారు. స్టార్ హీరో అవడం ఎంత కష్టమో.. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంతకన్నా కష్టం. రాజకీయాల్లో రాణించాలని ఎంతో మంది స్టార్ హీరోలు కలలు కన్నారు. కానీ అది అందరికీ సాధ్యం కాలేదు.

కేవలం ముగ్గురు మాత్రమే సక్సెస్ అయ్యారు. అందులో చూసుకుంటే తమిళంలో ఎంజీఆర్, జయలలిత ఇటు తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే సీఎంలు అయ్యారు. అటు తమిళంలో జయలలిత చనిపోయిన తర్వాత రాజకీయాల్లో కల్లోలం మొదలైంది. ఆ సమయంలో రజినీకాంత్ గనక ఎంట్రీ ఇచ్చి ఉంటే మూడో ఆప్షన్ అయి ఉండేవారు. కానీ వయసు అయిపోయిన తర్వాత వస్తే రాజకీయాల్లో ఏం సాధించలేమని ఆయనకు తెలుసు. అందుకే మిన్నకుండి పోయారు. అటు కమల్ హాసన్ పార్టీ పెట్టినా కనీస ఆదరణ కూడా దక్కలేదు. కానీ ఇప్పుడు విజయ్ దలపతి ఎంట్రీ ఇచ్చాడు.

వయసు ఉన్నప్పుడే రాజకీయాల్లో రాణించాలని ఆయన డిసైడ్ అయినట్టు ఉన్నారు. అందుకే ఇప్పుడు పార్టీ పేరను కూడా అధికారికంగా ప్రకటించారు. విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం(TVK). ఇప్పుడు ఆయన చేతిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి చేసిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాను అని ప్రకటించారు. ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉండిపోతానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని.. కేవలం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే టార్గెట్ గా నిలబడుతాను అంటూ ప్రకటించారు. దాంతో ఇప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ పేర్లు తెరమీదకు వచ్చారు.

మొదట్లో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఇలాగే సినిమాల్లో నటించను.. ఇక రాజకీయాల్లోనే ఉంటాను అని ప్రకటించారు. కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కొన్ని రోజులు కేంద్రమంత్రిగా చేశారు. తర్వాత రాజకీయాలకు దూరం అయి ఇప్పుడు మళ్లీ హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు.

అటు పవన్ కల్యాణ్‌ కూడా ఇక సినిమాల్లో నటించను అని ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్లారు. ఏడాది తిరగక ముందే నిర్ణయం మార్చుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చారు. మాట ఇవ్వడం చాలా సులభం. కానీ ఆ మాట నిలబెట్టుకోవడం కత్తి మీద సాము లాంటిది. మరి ఇప్పుడు విజయ్ కూడా సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెబుతాడా లేదంటే తిరిగి రీ ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us