Prabhas : ప్రభాస్ ని వీళ్ళు మించిపోతారా..?
Vedha - May 28, 2021 / 08:05 AM IST

Prabhas : ప్రభాస్ ..ఇప్పుడు పాన్ ఇండియన్ స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఒకే ఒక్క టాలీవుడ్ హీరో. బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. ఆదిపురుష్ సినిమాతో మొదటిసారి హిందీలో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అండ్ మార్కెట్ మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ సత్తా చాటిన దర్శకుడుగా రాజమౌళికి ఎంతటి పేరొచ్చిందో హీరోగా ప్రభాస్ కి అంతటి పేరొచ్చింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి అభిమానులు అసాధారణంగా పెరిగిపోయారు.

Will they surpass Prabhas ..?
చైనా, జపాన్ లలో ప్రభాస్ కి అభిమాన సంఘాలున్నాయి. ఆయన ప్రతీ సినిమా అక్కడ అందరూ చూస్తారు. ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాలు సెట్స్ మీదున్నాయి. రాధే శ్యామ్ ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. యూవీక్రియేషన్స్ 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇక సలార్ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రశాంత్ నీల్ దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2022 ఏప్రిల్ లో రిలీజ్ చేస్తారని ప్రకటించారు.
Prabhas : ప్రభాస్ ని మించి పోయే సత్తా ఎంతమందికి ఉందో ..?
ఆదిపురుష్ పౌరాణికం. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత పాత్రలో సైఫ్ అలీఖాన్ రావాణ పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకుడు. ఇలా ప్రభాస్ ప్రతీ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లోనే తయారవుతోంది. అయితే ఆయనను ఫాలో అవుతున్నారు టాలీవుడ్ హీరోలు. ఇప్పటికే దాదాపు అందరూ స్టార్స్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. మీడియం హీరోలు తప్ప అందరి చూపు పాన్ ఇండియన్ మార్కెట్ మీదే. మరి ప్రభాస్ ని మించి పోయే సత్తా ఎంతమందికి ఉందో తెలియాలంటే పరిస్థితులు అనుకూలించి ఈ ఏడాది రిలీజయ్యే సినిమాలను బట్టి ఏ హీరో స్థాయి ఏంటో తెలుస్తుంది.