ఉప్పెన సినిమాతో మెగా అభిమానులని నిరాశపెడతారా ..?

మెగా మేనల్లుడు .. పంజా వైష్ణవ్ గా పేరు తెచ్చుకున్న సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన. ఈ సినిమా ఎప్పుడో అన్నీ కార్యక్రమాలని పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే కరోనా కారణంగా థియోటర్స్ మూతపడటంతో ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజైనప్పటికి ఈ సినిమా మాత్రం ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు. సుకుమార్ దగ్గర అసోసియేట్ గా చేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది.

Uppena Movie Wiki, Review, Cast, Crew, Trailer, Release Date - Say Cinema

మైత్త్రీ మూవీమేకర్స్ .. సుకుమార్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగానే అంచనాలున్నాయి. ఇక ముందు నుంచి నిర్మాతలు ఎన్నిసార్లు ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినప్పటికి మేకర్స్ ఖండిస్తూ వస్తున్నారు. 2021 సంక్రాంతి సందర్భంగా నేరుగా థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తారని గట్టిగా చెప్పుకొస్తున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ మెగా హీరో సినిమాని థియోటర్స్ లో చూడాలని ఆతృతగా ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని కాస్త డిసప్పాయింట్ చేస్తుందట. తమ అభిమాన హీరో సినిమా థియోటర్స్ లో చూడాలనుకుంటే ఇప్పుడు నిర్ణయం మార్చుకొని ఓటీటీలో రిలీజ్ అన్న మాట వినడానికి ఆసక్తిగా లేరని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇవన్ని కేవలం పుకార్లేనని ఈ సినిమాని థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తారని చెప్పుకుంటున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో.

Advertisement