Jagapatibabu : జగపతి బాబులా శ్రీకాంత్ సెటిలవుతాడా..?

Jagapatibabu : జగపతి బాబు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎన్ని సూపర్ హిట్స్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో శోభన్ బాబు ఆ తర్వాత మళ్ళీ జగపతి బాబు ఒక జోనర్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. చెప్పాలంటే శోభన్ బాబు అంతటి పేరు జగపతి బాబు సంపాదించుకున్నాడు. హీరోగా చేస్తూనే అంతపురం లాంటి సినిమాలలో గేస్ట్ రోల్ పోషించి తన సత్తా చాటాడు. ఇక హీరోగా కెరీర్ డౌన్ ఫాల్ అయ్యాక కొంతకాలం జగపతి బాబు సినిమాలకి దూరమయ్యాడు.

will srikanth settles like jagapatibabu...?
will srikanth settles like jagapatibabu…?

సినిమాలకి దూరమయ్యాడు అనేకంటే సినిమాలలో హీరోగా అవకాశాలు రాలేదని చెప్పాలి. ఇక హీరోగా కాదు మొత్తంగా జగపతి బాబు కెరీర్ క్లోజ్ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అనూహ్యంగా జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమయింది. నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో జగపతి బాబు జితేంద్రగా ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అద్భుతమైన పాత్రలు చేస్తూ హీరోలకి సమానంగా క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు కోసమే ప్రత్యేకంగా పాత్రలు తయారవుతున్నాయి.

Jagapatibabu : శ్రీకాంత్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకుంటున్నారు..!

అయితే హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శ్రీకాంత్ కెరీర్ కూడా ఇప్పుడు అంత ఆసక్తికరంగా సాగడం లేదు. దాంతో నెగిటివ్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే జగపతి బాబు మాదిరిగా శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ శ్రీకాంత్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి అఖండ శ్రీకాంత్ కి ఎలాంటి సక్సస్ ఇస్తుందో.

Advertisement