Nithin : నితిన్ – సాయి పల్లవి కాంబినేషన్ సెట్ అవుతుందా..?

Nithin : నితిన్ ప్రస్తుతం రంగ్ దే సక్సస్ మూడ్ లో ఉన్నాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. గత ఏడాది భీష్మ సినిమాతో సక్సస్ అందుకున్న నితిన్ ఫిబ్రవరిలో వచ్చిన చెక్ సినిమాతో అనూహ్యంగా ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. కానీ ఆ సినిమా ప్రభావం రంగ్ దే సినిమా మీద పడలేదు. దాంతో నితిన్ మంచి ఊపులో ఉన్నాడు. ఇప్పటికే నితిన్ చేతిలో రెండు సినిమాలున్నాయి.

will-nithin-sai-pallavi-combination-sets
will-nithin-sai-pallavi-combination-sets

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లో నితిన్ నటిస్తుండగా ఇటీవలే ఈ సినిమాకి మాస్ట్రో అన్న టైటిల్ ని ఫిక్స్ చేస్తూ నితిన్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ అభిమానులనే కాదు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అలాగే పవర్ పేట అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న సినిమాని త్వరలో సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడు.

Nithin : త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తుందని అంటున్నారు.

ఇదే క్రమంలో కొత్త కథలని వింటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రచయిత దర్శకుడు వక్కంతం వంశీ ఒక చెప్పినట్టు .. నితిన్ కి కూడా ఆ కథ నచ్చి పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తుందని అంటున్నారు. ఇక మరొక కొత్త దర్శకుడు నితిన్ కి కథ చెప్పినట్టు తాజా సమాచారం. అంతేకాదు ఈ కథ ప్రకారం నితిన్ కి జంటగా ఫుదా బ్యూటీ సాయి పల్లవి అయితే పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నారట. మరి సాయి పల్లవికి కథ చెప్పి ఒప్పిస్తాడా లేదా చూడాలి. ప్రస్తుతం సాయి పల్లవి వరస సినిమాలతో చాలా బిజీగా ఉంది. త్వరలో లవ్ స్టోరి, విరాట పర్వం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నాని తో శ్యాం సింగ్ రాయ్ సినిమా చేస్తోంది.

Advertisement