Nikhil : నిఖిల్ – అనుపమ ఆకట్టుకుంటారా..?

Nikhil : యంగ్ హీరో నిఖిల్ బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ యంగ్ హీరో గత చిత్రం ‘అర్జున్ సురవరం’ హిట్ అవ్వడంతో ఫాం లోకి వచ్చిన నిఖిల్ వరుసగా సినిమాలు కమిటవుతున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమా చేస్తూనే మరోవైపు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో 18పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. కార్తికేయ-2 థ్రిల్లర్ మూవీ కాగా 18పేజెస్ రొమాంటిక్ లవ్ స్టోరీ.

will Nikhil - Anupama attracts youth...?
will Nikhil – Anupama attracts youth…?

ఈ రెండు సినిమాలు రెండు డిఫ్రెంట్ జోనర్‌లో తెరకెక్కుతున్నవి కావడంతో అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో నిఖిల్ సరసన కుర్రభామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కూడా ఒక హాట్ టాపిక్. గతంలో నిఖిల్ – కలర్స్ స్వాతి జంటకి హిట్ పెయిర్ అని పేరుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన స్వామిరారా – కార్తికేయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించాయి. అందుకే వీరి కాంబినేషన్ లో కార్తికేయ 2 ప్లాన్ చేశారు. కానీ స్వాతి పెళ్ళి చేసుకొని సెటిలవడంతో ఆమె స్థానంలో అనుపమను తీసుకున్నారు.

Nikhil : నిఖిల్ – అనుపమ పెయిర్ మీద కూడా మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇప్పుడు నిఖిల్ – అనుపమ పెయిర్ మీద కూడా మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కి కూడా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు బాగానే పెరిగిపోయాయి. కాగా 18పేజెస్ సినిమాకు కథ – స్క్రీన్ ప్లేను స్టార్ డైరెక్టర్ సుకుమార్ అందించడం విశేషం. ఆయన శిష్యుడే సూర్యప్రతాప్. ఈయన కరెంట్ – కుమారి21ఎఫ్ సినిమాలు తెరకెక్కించాడు. ఇక నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ కార్తికేయ 2 రెండవ సినిమా. జూన్ 1న 18పేజెస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 15న కార్తికేయ 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.