Keerthy Suresh: కీర్తి సురేష్ గ‌ర్భ‌వ‌తా.. అంత రిస్క్ చేస్తుందా?

Keerthy Suresh: మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. సావిత్రి పాత్ర‌ని దింపేసిన కీర్తి సురేష్ జాతీయ స్థాయి అవార్డ్ కూడా అందుకుంది. కెరీర్‌ ఆరంభం నుంచే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న‌‘కీర్తిసురేశ్‌’.. ‘మహానటి’ త‌ర్వాత పూర్తి కమర్షియల్‌ సినిమాలు చేస్తోంది.


Will Keerthy Suresh perform Pregnant Role in her Next movie?
Will Keerthy Suresh perform Pregnant Role in her Next movie?


కీర్తి సురేష్ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే చేస్తూ వస్తుంది. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న చిత్రం ‘మిమి’. కృతిసనన్‌ కీలక పాత్రలో లక్ష్మణ్‌ ఉత్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్దె గర్భంతో ఓ యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? వాటి నుంచి ఎలా బయటపడిందన్న ఇతివృత్తంతో భావోద్వేగభరితంగా ఈ సినిమా తెర‌కెక్క‌గా, ఇందులో కృతి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.


ఇప్పుడు ఈ సినినిమాని తెలుగులో, త‌మిళంలో రీమేక్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. స్క్రిప్ట్‌ విన్న కీర్తి సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘పెంగ్విన్‌’లో గర్భవతిగా, తల్లిగా కనిపించిన కీర్తి మరోసారి ఈ సినిమాలోనూ అటువంటి పాత్రే పోషించాల్సి రావడం విశేషం.


ఇది ‘మాలాఆయ్ వ్హయ్చీ’ అనే మరాఠీ సినిమాకి రీమేక్. నిజానికి 2013లో ఇదే సినిమా ‘వెల్కమ్ ఒబామా’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది కూడా. అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. అందుకే కీర్తి స్టార్ డమ్ తో అయినా ఆడుతుందనే అభిప్రాయంతో ఇప్పుడు రీమేక్ చేసే ధైర్యం చేస్తున్నారు.