మాస్ మహారాజా అనుకున్నవన్నీ జరుగుతాయా ..?

గత కొంత కాలంగా మాస్ మహారాజా గా క్రేజ్ ఉన్న రవితేజ కి భారీ హిట్ దక్కడం లేదు. వరసగా సినిమాలైతే చేస్తున్నాడు గాని .. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. ముందు ఉన్న సక్సస్ ట్రాక్ మేయింటైన్ చేయడానికి రవితేజ చాలా తాపత్రయ పడుతున్నాడు. ఆ మధ్యలో వచ్చిన రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ రవితేజ అకౌంట్ లో హిట్ పడలేదు. నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, టచ్ చేసి చూడు, డిస్కో రాజా సినిమాలు వచ్చాయి గాని .. ఆ సినిమాల వల్ల రవితేజ కి ఒరిగిందేమీ లేదు.

Ravi Teja's Disco Raja Movie Review & Rating {3.5/5}

కాగా ప్రస్తుతం రవితేజ క్రాక్ అన్న సినిమా కంప్లీట్ చేశాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. ఆర్జీవీ అప్సర రాణి ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సాంగ్ రిలీజై సినిమా మీద భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాని 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.

Ravi Teja unveils the first look of 'Khiladi'

అలాగే మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టాడు రవితేజ. గతంలో రవితేజ తో వీర సినిమాని తీసిన రమేష్ వర్మ తో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. ఖిలాడి అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుండగా ఇటీవలే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసి టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే సినిమా చూపిస్త మావా, నేను లోకల్ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ని తీసిన త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అలాగే యూవీ క్రియేషన్స్ లో నిర్మించబోయే సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడని ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. వరసగా ప్రాజెక్ట్స్ అయితే చేతిలో ఉన్నాయి గాని భారీ హిట్ కొట్టి సక్సస్ ట్రాక్ ఎక్కాలన్న రవితేజ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా అని కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారట.

Advertisement