Bollywood: షంషేరా.! బాలీవుడ్‌కి మళ్ళీ ఆ కళ వచ్చినట్టేనా.?
NQ Staff - June 25, 2022 / 10:26 AM IST

Bollywood: రణబీర్ కపూర్, వాణీ కపూర్, సంజయ్ దత్.. ఇలా ప్రముఖ తారాగణం ‘షంషేరా’ సినిమాతో ఆకట్టుకునేలానే వుంది.! ఔను, ‘షంషేరా’ సినిమా ట్రైలర్ వచ్చాక, బాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ నుంచి సరైన సినిమా రాలేదన్నది నిర్వివాదాంశం.

Will Bollywood gets back its glory with Shamshera Movie
సౌత్ సినిమా డామినేట్ చేస్తోంటే, బాలీవుడ్ ప్రముఖులు బిక్కమొహం వేయాల్సి వచ్చింది. బాలీవుడ్ మీడియా అయితే, సౌత్ సినిమా మీద పడి ఏడవడం మొదలు పెట్టింది. మంచి సినిమా ఎక్కడైనా, ఎలాగైనా ఆడుతుంది. నిజానికి, సినిమా అనేది ఓ కళ. దానికి బౌండరీస్ వుండవు.
కంటెంట్ ఎంత గొప్పగా చెప్పగలిగితే, అంతలా అది ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని ‘ఆర్ఆర్ఆర్’ నిరూపించింది. రాజమౌళి వేసిన బాటలో, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ ఇలా చాలా సినిమాలు దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయ్.. ఇండియన్ సినిమా, వరల్డ్ సినిమాగా మారుతోంది.
షంషేరా పరిస్థితేంటి.?
‘షంషేరా’ ట్రైలర్ చూస్తున్నంతసేపూ, మరో ఇండియన్ సినిమా.. ప్రపంచ స్థాయికి ఎదగబోతోందన్న అభిప్రాయాలైతే చాలామందిలో కలిగాయి. రేప్పొద్దున్న సినిమా ఎలా వుండబోతోంది.? అన్నది వేరే చర్చ. ప్రస్తుతానికైతే, బాలీవుడ్ ఒకింత
సంబరపడే పరిస్థితే నెలకొంది.
రణ్‌బీర్ కపూర్, వాణీ కపర్, సంజయ్ దత్.. ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. టెక్నికల్లీ హై సౌండ్ అనుకోవాల్సిందే. ఆ స్థాయిలో సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది.