Wild dog : వైల్డ్ డాగ్ హీరోయిన్ టాలీవుడ్ పాన్ ఇండియన్ హీరోల మీదే కన్నేసింది..!

Wild dog : వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున నటించిన ఈ సినిమాకి అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహించాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. కాగా ఈ సినిమాలో నాగార్జున ఏసీపీ అజయ్ వర్మగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. నాగార్జునకి జంటగా దియా మీర్జా సయామీ ఖేర్ నటించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నాగార్జున అద్భుతమైన క్యారెక్టర్‌లో అభిమానులతో పాటు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారట.

wild-dog-heroine-is-interested-in-tollywood-pan-indian-heroes
wild-dog-heroine-is-interested-in-tollywood-pan-indian-heroes

గత కొంతకాలంగా నాగార్జున కి భారీ హిట్ దక్కడం లేదు. అందుకే వైల్డ్ డాగ్ సినిమాని ఎంతో కసితో చేసినట్టు తెలుస్తోంది. ఇక దియా మీర్జా హైదరాబాదీ అయినప్పటికి ముంబైలో హిందీ సినిమాలతో స్టార్ హీరోయిన్ మారింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. కాగా మొదటిసారి నాగార్జున తో వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే దియా మీద టాలీవుడ్ మేకర్స్ దృష్టి పడిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో టాలీవుడ్ సీనియర్ హీరోలతో నటించే అవకాశం అందుకుంటుందని చెప్పుకుంటున్నారు.

Wild dog : ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించాలి..సయామీ ఖేర్.

ఇక మరొక హీరో సయామీ ఖేర్ నాగార్జునతో యాక్షన్ సీన్స్ లో కనిపించబోతోంది. అయితే సయామీ ఖేర్ కి టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్స్ అయిన ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించాలని ఉందంటూ తాజాగా వెల్లడించింది. 2015 లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన డెబ్యూ సినిమా రేయ్ తో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో వైల్డ్ డాగ్ సినిమాతోనే వస్తోంది. మరి ఈ సినిమాతో సయామి ఖేర్ కి టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుందా లేదా చూడాలి.

Advertisement