Balakrishna : బాలకృష్ణ బిబి 3 కి ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేశారేంటీ ..?

Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బిబి 3 అన్న వర్కింగ్ టైటిల్ పెట్టి షూటింగ్ జరుపుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ యాక్షన్స్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. గతంలో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి.

why they fixed bala krishna bb3 title like this;...?
why they fixed bala krishna bb3 title like this;…?

దాంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసినట్టు సమాచారం. కాగా ఈ సినిమా మే 28 న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. దాంతో దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా టాకీపార్ట్ కంప్లీట్ చేస్తూనే మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే బిబి3 ఫస్ట్ రోర్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో శాంపిల్ చూపించాడు బోయపాటి శ్రీను. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు రకాల గెటప్స్ లో కనిపించబోతున్నాడు.

Balakrishna : బాలయ్య – బోయపాటి సినిమాకి అనుకుంటున్న లేటెస్ట్ ” గాడ్ ఫాదర్ ” ..!

అయితే సినిమాకి ముందు నుంచి టైటిల్ విషయంలో పలు రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పలు టైటిల్ కూడా ప్రచారంలో నిలుస్తున్నాయి. మోనార్క్ అన్న పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బాలయ్య కి గతంలో రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ని పెట్టిన బోయపాటి ఈ హ్యాట్రిక్ సినిమాకి మరింత పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టాలని మంచి టైటిల్ కోసం చూస్తున్నాడట. ఈ క్రమంలోనే ” గాడ్ ఫాదర్ ” అన్న టైటిల్ ని బాలయ్య – బోయపాటి సినిమాకి అనుకుంటున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. టైటిల్ అదిరిపోయినప్పటికి ఇంకా పవర్ ఫుల్ గా ఉంటే బావుంటుందని బాలయ్య అభిమానులు అభిప్రాయపడుతున్నారట. చూడాలి మరి ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా లేదా… లేక ముందు నుంచి ప్రచారంలో ఉన్న మోనార్క్ టైటిల్ ని ఫైనల్ చేస్తారా.

Advertisement