Rishabh Pant : త‌న జెర్సీపై టేప్ అంటించుకొని గ్రౌండ్‌లోకి దిగిన రిష‌బ్ పంత్‌.. ఎందుకో తెలుసా?

Rishabh Pant : ధోని త‌ర్వాత టీమిండియాలో త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌ర‌చుకున్న క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ అద్భుతంగా ఆడుతూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. జైపూర్‌లో జరిగిన మొదట టీ20లో విజయం సాధించిన తర్వాత రాంచీలో కివీస్‌ను ఓడించారు టీమిండియా. రెండు మ్యాచ్‌ల‌లోను రిష‌బ్ పంత్ విన్నింగ్ షాట్ ఆడారు.

why rishabh pant had a tape on his Jersey
why rishabh pant had a tape on his Jersey

రెండు మ్యాచ్‌ల‌ను అభిమానులు ఆస్వాదించగా, అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ జెర్సీ. రాంచీలోజ‌రిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ కుడి ఛాతీపై టీ-షర్ట్ టేప్ ఉన్నట్లు అనిపించింది.అయితే చాలా మంది టేప్‌కి కారణాన్ని తెలుసుకోవాలని కోరుకున్నారు. అసలు విషయం తెలిసి షాకయ్యారు.

ఇటీవల ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021 సందర్భంగా ధరించిన జెర్సీ అని అవాక్కయ్యారు. ఆ జెర్సీపై టీ20 వరల్డ్ కప్ 2021 లోగో ఉండడంతో, దానిని ద్వైపాక్షిక సిరీస్‌లలో ధరించేందుకు ఐసీసీ అనుమతించదు. అందుకే ఆ సింబల్‌పై టేప్ వేశాడు. ఇతర భారత ఆటగాళ్లు రెగ్యులర్ జెర్సీలో కనిపించగా, పంత్ మాత్రమే టీ20 ప్రపంచకప్ 2021 జెర్సీని ధరించడం గమనార్హం.

ఇలా ఎందుకు చేశాడో మాత్రం ఎవ‌రికి తెలియరాలేదు. కాగా, పాకిస్తాన్, బ్లాక్‌క్యాప్స్‌తో వరుసగా ఓడిపోయిన తర్వాత ప్రపంచ కప్‌లో భారతదేశం ప్రయాణం సూపర్ 12 దశలోనే ముగిసింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మొదటి మ్యాచ్‌లో సునాయసంగా గెలుస్తుందనుకున్న భారత జట్టు, ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో చివరి 3 బంతుల్లో 3 పరుగులు కావాల్సిన దశలో బౌండరీ బాది, మ్యాచ్‌ను ముగించాడు రిషబ్ పంత్. రెండో టీ20 మ్యాచ్‌లో అయితే వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది, 17.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు రిషబ్ పంత్. ఈ రెండు మ్యాచుల్లో భారత మిడిల్ ఆర్డర్ డొల్లతనం సుస్పష్టంగా కనిపించింది.