నిఖిల్ పెళ్లి ఇంత తొందరగా జరగడానికి కారణం ఏంటో తెలుసా..

Advertisement

○ హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన యువ నటుడు నిఖిల్. తరువాత స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, అర్జున్ సురవరం సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు ఆదరాభిమానాలు తెచ్చికున్నాడు ఈ యువ హీరో. తను ప్రతి సినిమాలో ఏదో ఒక వెరైటీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. స్క్రిప్ట్ సెలక్షన్ లో మంచి ప్రాధాన్యత ఉంది నిఖిల్ కి. ఇక ప్రేమ విషయానికి వెళితే టాలీవుడ్ లో కలర్స్ స్వాతి నిఖిల్ ప్రేమించుకుంటున్నారు అని కొన్ని రూమర్లు వచ్చాయి.

అది ఎంతకు నిజమో కాదో తెలిదు కానీ మొత్తానికి భీమవరం కి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో పడ్డాడు యువ హీరో నిఖిల్.ఈ ఇరు జంట నిఖిల్,పల్లవిల ప్రేమాయణం గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది.ఈ విషయంపై పలు ఇంటర్వ్యూలలో కూడా తను ప్రేమలో ఉన్నానని చెప్పాడు.మొత్తానికి వీళ్ళ ప్రేమ యవ్వారం పెద్దలవరకు వెళ్ళింది. ఇరు కుటుంబాలు వీళ్ళ ప్రేమను ఒప్పుకున్నారు. తరువాత వీళ్లిద్దరికి గోవాలో ఫిబ్రవరి 1 వ తేదీన ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.ఆ గోవాలో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఇక పెళ్లి విషయానికి వచ్చే సరికి పెద్ద ఎత్తున చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించడం తో పలుమార్లు నిశ్చయించిన పెళ్లి వాయిదా వేశారు. ఇక కరోనా తగ్గేలా లేదని లాక్ డౌన్ సమయంలోనే మే 14 తేదీ న హైదరాబాద్ లోని ఒక రిసోర్ట్ లో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో నిఖిల్ ఫ్యామిలీ మరియు కొంతమంది స్నేహితులు పాల్గొన్నారు.అలాగే కొంతమంది డైరెక్టర్లు చందు మొండేటి,సుధీర్ వర్మ ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి ఇంత హుటాహుటిన జరగడానికి అసలు నిజం ఏంటంటే.. నిఖిల్ నాన్న గారి ఆరోగ్యం క్షిణించి పోయింది.కొంతకాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్నాడు.ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతనికి వాళ్ళ తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, తన తండ్రి అంటే తనకు చాలా ఇష్టమని అందుకోసమే హుటాహుటిన పెళ్లి జరిగిందని అంటున్నారు నిఖిల్ సన్నిహిత వర్గాలు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here