Kovai Sarala: త్యాగం చేసిన కోవై స‌ర‌ళ‌.. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..!

Kovai Sarala: సాధార‌ణంగా మేల్ క‌మెడీయ‌న్స్ కి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆఫ‌ర్స్ ఎక్కువ‌గా వ‌చ్చేవి. బ్ర‌హ్మానందం, కోట శ్రీనివాస‌రావు, బాబుమోహ‌న్, ఆలీ వంటి స్టార్ క‌మెడీయ‌న్స్ ఉన్న స‌మ‌యంలో లేడీ క‌మెడీయ‌న్‌గా స‌త్తా చాట‌డం అంత ఆషా మాషీ కాదు. కాని త‌న‌దైన స్టైల్‌లో కామెడీ పండిస్తూ ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్నారు కోవై స‌ర‌ళ‌. వెండితెర‌పై త‌న హాస్యంతో ఎంతో మందిని న‌వ్వించిన కోవై స‌ర‌ళ జీవితంలో క‌న్నీళ్లు , క‌ష్టాలు ఉన్నాయి.

Kovai Sarala
Kovai Sarala

తెలుగు, త‌మిళ భాష‌ల‌లో స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసిన కోవై స‌ర‌ళ త‌న‌దైన కామెడీతో హాస్యం పంచారు.ముఖ్యంగా కాంచ‌న సినిమాలో కోవై స‌ర‌ళ కామెడీకి ఫిదా కాని వారు ఉండ‌రు. హీరో అయినా సరే విలన్ అయినా సరే తన పక్కన ఎవరు నటించినా కూడా ఒక ఆటాడుకుంటు వెండితెరపై అద్భుతమైన కామెడీని పండిస్తారు.

కోవై స‌ర‌ళ కాస్త చైనా మ‌హిళ‌లా క‌నిపిస్తుంటారు. కాని ఆమె నేటివ్ చెన్నై. ఏ భాష‌లో న‌టించిన త‌ను సొంతంగా డ‌బ్బింగ్ చెప్పేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంది. డిఫ‌రెంట్ వాయిస్‌తో కోవై స‌ర‌ళ మాట్లాడుతుంటే ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చుతుంది. మొదట్లో ఆమె వాయిస్ చూసి అందరూ నెగిటివ్ గా కామెంట్స్ చేసేవారట. కానీ సినిమాలకు అదే మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది.

నువ్వే కావాలి, దేశ ముద‌రు, కాంచ‌న వంటి సినిమాల‌లో కోవై స‌ర‌ళ అద్భుత‌మైన నట ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌ర‌చి ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకుంది. 800కి పైగా చిత్రాల‌ల‌లో కోవై స‌ర‌ళ న‌టించ‌గా ఎక్కువ‌గా బ్ర‌హ్మానందం కాంబినేష‌న్‌లో న‌టించింది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేది. ఏడాదిలో 365రోజులు బిజీ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన స‌ర‌ళ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ప్ర‌స్తుతం కోవై స‌ర‌ళ వ‌య‌స్సు 59 సంవ‌త్స‌రాలు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి జోలికే వెళ్లలేదు. న‌లుగురు చెల్లెళ్ల కోసం త‌న జీవితాన్ని త్యాగం చేసింది. మొద‌ట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో నలుగురు చెల్లెళ్ళ జీవితాన్ని తనే చూసుకుందట. చ‌దువులు, పెళ్లిళ్లు అంటూ వారికే ఎక్కువ స‌మ‌యం కేటాయించిన కోవై స‌ర‌ళ త‌న జీవితం గురించి ఏ నాడు ఆలోచించ‌లేదు. పెళ్లి వైపు కూడా చూడ‌ని కోవై స‌ర‌ళ సామాజిక కార్య‌క్ర‌మాలు కూడా బాగానే చేస్తుంటారు.