Kathi Mahesh: ప్ర‌మాద స‌మ‌యంలో క‌త్తి మ‌హేష్‌తో ఉన్న వ్య‌క్తి ఎవ‌రు, వారు ఎక్క‌డికి వెళుతున్నారు?

Kathi Mahesh:సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గాయ‌ప‌డి ఆ త‌ర్వాత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కోలుకొని తిరిగి వ‌స్తాడ‌ని అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో ఆయ‌న మ‌ర‌ణించాడ‌ని వైద్యులు చెప్ప‌డంతో క‌త్తి మృతిపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆసుప‌త్రి యాజ‌మాన్యంతో పాటు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కొంత మంది ప్రమాదం మీద అనుమానాలు వ్యక్తం చేశారు.

Kathi Mahesh
Kathi Mahesh

క‌త్తి మ‌హేష్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన మంద‌కృష్ణ మాదిగ‌తో పాటు మ‌హేష్ తండ్రి కూడా మృతిపై అనుమానం వ్య‌క్తం చేస్తూ విచార‌ణ కోరారు. అందుకు ఏపీ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉంటే విచారణ జరపడానికి సిద్ధమని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించడంతో పాటు ఆయ‌న కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని సురేష్ అన్నారు.

కత్తి మహేష్ దళిత జాతిలో ఉన్నత స్థితికి ఎదిగిన వ్య‌క్తి. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం జ‌రిపారు. ఆయ‌న మృతిపై కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేస్తే విచార‌ణ జ‌రిపించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని అని ఆదిమూల‌పు చెప్ప‌పుకొచ్చారు. అయితే యాక్సిడెంట్ స‌మ‌యంలో మ‌హేష్‌తో పాటు సురేష్ అనే వ్య‌క్తి ఉండ‌గా, ఆయ‌న చిన్న పాటి దెబ్బ‌ల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణానాకి సంబంధించి అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో విచార‌ణ జ‌రిపించిన పోలీసులు అనేక ఆస‌క్తిక‌ర విషయాలు వెల్లడించారు. సురేష్ అనే వ్య‌క్తి కత్తి మహేష్ బిజినెస్ పార్టనర్ అని, ఇద్దరం కలిసి మైనింగ్ వ్యాపారం చేయాలని అనుకున్నారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా ఉదయ మాణిక్యం గ్రామంలో మైనింగ్ చేద్దాం అని వారు భావించారు.

ఎన్ఓసీ కోసం ఎమ్మార్వో ఆఫీస్ నుంచి పిలుపు వచ్చిందని , ఎన్ఓసీ రావాలంటే గ్రామ సభ పెట్టాలి.. ఆ గ్రామ సభ కోసం ఎంపీడీవో గారు మమ్మల్ని పిలిచారు. గ్రామ సభ కోసం మేం ఆ రాత్రి మేం వెళ్లామని సురేష్ వెల్లడించారు.

కత్తి మహేష్ కి డ్రైవింగ్ వచ్చినా సరే పూర్తిస్థాయిలో రాదు కాబట్టే తను డ్రైవింగ్ చేయమని కోరాడు అని తాము చిత్తూరు జిల్లాలోని కత్తి మహేష్ స్వగ్రామానికి వెళ్తున్నాము అని సురేష్‌ చెప్పుకొచ్చారు. తాను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పెద్దగా గాయాలు కాలేదని కానీ ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే ముందుకు వెళ్లి తలకు గాయాలయ్యాయి అని చెప్పుకొచ్చాడు.