Chiranjeevi : చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ.! ఎవరు బెస్ట్ డాన్సర్.?
NQ Staff - December 27, 2022 / 07:31 AM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్.? ఇందులో మరీ అంత ఆలోచించాల్సిందేముంది.? డాన్సుల్లో మెగాస్టార్ చిరంజీవే నెంబర్ వన్. కానీ, ఆ విషయాన్ని చెప్పాలంటే సినీ పరిశ్రమలో ఎవరైనా ఒకింత తటపటాయించాల్సిందే.. ఎందుకంటే, చిరంజీవి పేరు చెబితే బాలయ్యకు కోపమొస్తుంది మరి.!
ఇంతకీ, ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అన్న ప్రశ్నకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ ఏం చెబుతారట.? అసలు ఈ ప్రశ్న ఎందుకు తెరపైకొచ్చిందో తెలుసా.? అటు చిరంజీవికీ, ఇటు బాలకృష్ణకీ కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు శేఖర్ మాస్టార్. ఆడా వుంటా.. ఈడా వుంటా.. అన్నట్టు ‘వాల్తేరు వీరయ్య’కీ, ‘వీర సింహా రెడ్డి’కీ శేఖర్ మాస్టర్ పని చేసిన సంగతి తెలిసిందే.
ఇద్దరి నుంచీ అదే నేర్చుకోవాలి..
ఇద్దరూ చాలామంచి డాన్సర్స్ అనీ, ఇద్దరిలోనూ వున్న కామన్ లక్షణం.. ఏదన్నా స్టెప్ గురించి చెబితే, అది పెర్ఫెక్ట్గా వచ్చేవరకూ ఇద్దరూ విశ్రమించరనీ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
‘వాళ్ళతో డాన్సులు వేయించడం కాదు.. ఆ ఇద్దరు స్టార్లతో పనిచేస్తున్నప్పుడు చాలా నేర్చుకుంటున్నాను నేను. ఆ డెడికేషన్.. ఆ టైమింగ్, ఆ టైమ్ సెన్స్.. ఇవి అందరూ వారి నుంచి నేర్చుకోవాలి..’ అని శేఖర్ మాస్టర్ చెప్పాడు.
అటు మెగా అభిమానులూ నొచ్చుకోకుండా, ఇటు బాలయ్య అభిమానులూ గుస్సా అవకుండా శేఖర్ మాస్టర్ భలే చెప్పాడు కదా.!