Salman Khan : సల్మాన్ ఖాన్ కు ప్రపోజ్ చేసిన లేడీ రిపోర్టర్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన హీరో..!

NQ Staff - May 28, 2023 / 09:18 AM IST

Salman Khan  : సల్మాన్ ఖాన్ కు ప్రపోజ్ చేసిన లేడీ రిపోర్టర్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన హీరో..!

Salman Khan  : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇండియాలోనే అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కూడా ఇతనే. అలాంటి సల్మాణ్ 60 ఏండ్ల వయసు వచ్చినా సరే ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు. కానీ ఈ వయసులో కూడా యంగ్ కుర్రాడిలా కనిపిస్తూ ఉంటాడు ఈ హీరో.

ఇక సల్మాన్ ఖాన్ పెండ్లి చేసుకుంటాడనే ఆశ అటు అభిమానులకు గానీ, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కు గానీ అస్సలు లేదు. కానీ ఈ హీరోకు ప్రపోజల్స్ మాత్రం అస్సలు ఆగట్లేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి. సల్మాన్ గతంలో చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. కానీ ఎవరినీ పెండ్లి చేసుకోలేదు.

60 ఏండ్ల వయసు వచ్చినా సరే ఆయనకు ఇంకా ప్రపోజల్స్ వస్తున్నాయి. తాజాగా ఐఫా-2023 వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందులో బాలీవుడ్ తారలు మొత్తం పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకలో ప్రెస్ మీట్ లో సల్మాన్ మాట్లాడుతుండగా ఓ లేడీ రిపోర్టర్ ప్రపోజ్ చేసింది.

సల్మాన్ నేను మీ కోసమే హాలీవుడ్ నుంచి వచ్చాను. మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడ్డాను. మీరు నన్ను పెండ్లి చేసుకుంటారా అని అడిగింది. దాంతో మీరు షారుఖ్ గురించి మాట్లాడుతున్నారు కదా అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు సల్మాన్. కాదు మీ గురించే అని ఆమె చెప్పడంతో.. సారీ నాకు పెండ్లి వయసు దాటిపోయింది. 20 ఏండ్ల క్రితం మీరు కలిసి ఉంటే బాగుండేది అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us