Karnan: కాంట్ర‌వ‌ర్సీ స‌బ్జెక్ట్‌కు ఏ తెలుగు హీరో న్యాయం చేస్తాడంటారు..!

Karnan: కొన్ని సినిమాలు భాషతో సంబంధం లేకుండా సూపర్ పాపులర్ అవుతుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన సినిమా కర్ణన్. 1990ల్లో తమిళనాడులోని కొన్ని ఊరిలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు మారి సెల్వరాజ్. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన తర్వాత సినిమా స్థాయి మరింత పెరిగింది. అణగారిన కులాలను పల్లెటూర్లలో ఎంత దారుణంగా చూస్తారు.. అంటరాని వాళ్ళు అంటూ వాళ్ళని ఎంత దారుణంగా హింసిస్తారు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు మారి. ఆయన టేకింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు.

Karnan

ధనుష్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. ఇప్పుడు కర్ణన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారు. దర్శకుడిపై ఇంకా క్లారిటీ రాలేదు. శ్రీకాంత్ అడ్డాలకు ఈ అవకాశం వచ్చిందని ప్రచారం జరిగినా కూడా అందులో నిజం లేదని తేలిపోయింది. ఇదిలా ఉంటే తమిళంలో లాల్ పోషించిన పాత్రను తెలుగులో రావు రమేష్ చేయనున్నారు.

Karnan

ముందుగా ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని వెంకటేష్ దగ్గరికి ప్రపోజల్ వచ్చింది. ప్రస్తుతం ఈయన అసురన్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. అందులో కూడా ధనుష్ హీరో. దాంతో కర్ణన్ సినిమాను కూడా వెంకటేశ్ రీమేక్ చేస్తే బాగుంటుందని కొందరు నిర్మాతలు భావించారు. అయితే సినిమా చూసిన తర్వాత ఈ కథ తెలుగులో వర్కౌట్ కాదు అంటూ వెంకీ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ లోకి వచ్చాడు. ఇంత కాంట్రవర్సీ సబ్జెక్ట్ ను బెల్లంకొండ ఎంతవరకు హ్యాండిల్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.