Prabhas : ప్రభాస్ హీరోగా రాబోయే 4 సినిమాల్లో ఏది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారు ?

Which of these 4 movies do you think will be a big hit
Which of these 4 movies do you think will be a big hit

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ‘సాహో’ డిజాస్టర్ అయినప్పటికీ ఆచిత్రం బాలీవుడ్లో వసూళ్లు రాబట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది. ఈ దెబ్బతో సినిమా టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ మార్కెట్ దేశ వ్యాప్తంగా భారీగా విస్తరించింది. విదేశాలలో కూడా అతనికి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ అనే కాదు మొత్తం భారతదేశంలో అతని స్థాయి అందుకోవడానికి ఏ స్టార్ హీరో అయినా ఎంతో కష్టపడాల్సిందే. ఇదే ఊపులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న నాలుగు సినిమాలు మరొక రెండు సంవత్సరాల్లో మన ముందుకు రానున్నాయి. అందులో ఒక సినిమా అయితే ఈ సంవత్సరం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లే. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్. అతని రాధేశ్యాం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

అది ఈ సంవత్సరమే విడుదల అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ప్రభాస్ ‘ఆదిపురుష్‘ అనే అతి భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇతిహాసం మూలకథ గా తెరకెక్కుతోంది. వీటితో పాటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక సైంటిఫిక్ ఫిక్షన్ కూడా ప్రభాస్ చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఈ రోజు వచ్చింది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అమితాబచ్చన్ వంటిస్టార్లు ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రానికి కనీసం 500 కోట్లు బడ్జెట్ అవుతుందని స్వయంగా నిర్మాతే వెల్లడించాడు. మరి ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలను వరుసగా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా ఏ సినిమా ను తమ ఫేవరెట్ గా ఎంచుకోవాలో ఒకరకంగా కష్టమే. అయితే దర్శకుడి కాంబినేషన్, అందులో నిండి ఉన్న స్టార్ నటీనటులు స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో సినిమాపై అంచనాలు ఉంటాయి.
[yop_poll id=”17″]

Advertisement