చిరంజీవి ఆచార్య తో ఎవరెవరు పోటి పడబోతున్నారో చూడండి .. బాక్సాఫీస్ దగ్గర సునామీనే ..!
Vedha - December 30, 2020 / 03:35 PM IST

చిరంజీవి ఆచార్య సినిమాతో 2021 సమ్మర్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ అంచనాలను భారీగా పెంచేసింది. ఇక కొరటాల శివ మిర్చి సినిమా నుంచి భరత్ అనే నేను సినిమాల వరకు వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అందుకే చిరంజీవి కొరటాల శివ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక చిరంజీవి కూడా ఈ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకోబోతున్నానన్న నమ్మకంగా ఉన్నారు. చిరంజీవి ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా కొరటాల ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజ్ సమయానికి మరో రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు పోటీ కాబోతున్నాయట. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ని సమ్మర్ అంటే జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యాం ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. దాదాపు ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కి షూటింగ్ కంప్లీట్ అయిన కూడా దాదాపు 4 నెలలు వీఎఫెక్స్ కి సమయం పడుతుందట. అంటే రాధే శ్యాం రిలీజ్ కూడా సమ్మర్ లోనే. అంతేకాదు ఈ సినిమా కూడా జూన్ .. జూలై లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ రకంగా చూస్తుంటే చిరంజీవి ఆచార్య కి రాధే శ్యాం, ఆర్ ఆర్ ఆర్ గట్టి పోటీ కాబోతున్నాయని తెలుస్తోంది.