Upasana : మెగా ఫ్యామిలీలో వారసుడు అడుగు పెట్టేది ఎప్పుడు?
NQ Staff - June 7, 2023 / 11:22 PM IST

Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్ తో ఉన్న సమయంలోనే ఆమె ఆస్కార్ అవార్డు కార్యక్రమాలకు హాజరయ్యింది. అంతే కాకుండా వరుసగా ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చింది.
కానీ ఈ మధ్యకాలంలో ఉపాసన పబ్లిక్ గా కనిపించడం లేదు. దాంతో ఆమె డెలివరీ సమయం దగ్గరికి వచ్చి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. మెగా కాంపౌండ్ నుండి మాకు అందుతున్న సమాచారం ప్రకారం జూన్ లేదా జూలై నెలలో కచ్చితంగా మెగా ఇంట్లో వారసుడిని తీసుకుని ఉపాసన అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తనయుడు పుట్టాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పుట్టాలంటూ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే చరణ్ కి పుట్టబోయేది పాపనా? బాబునా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
మొత్తానికి రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి మరోసారి తాత కాబోతున్న కారణంగా కూడా మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ క్షణంలో అయినా మెగా ఫ్యామిలీ నుండి ఆ శుభ వార్త వినే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనుక మెగా ఫాన్స్ గేట్ రెడీ.